వెంకీ కుమార్తె ప్రేమ వివాహం

Sat Sep 22 2018 09:53:05 GMT+0530 (IST)

విక్టరీ వెంకటేష్ రియాలిటీలో `మామగారు` కాబోతున్నారా? అంటే అవుననే తాజా సమాచారం. వెంకీ కుమార్తె అశ్రిత తాను ప్రేమించిన యువకుడిని పెళ్లాడబోతోందని తెలుస్తోంది. ఆ మేరకు ఇరు కుటుంబాల పెద్దల మధ్యా మాటలు నడుస్తున్నాయిట. ఇంతకీ వెంకీ డాటర్ పెళ్లాడబోయేది ఎవరిని? అంటే హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ ఆర్.సురేందర్ రెడ్డి మనవడిని అని తెలుస్తోంది.ఆ ఇరువురి మధ్యా స్నేహం ప్రేమగా పల్లవించిందిట. పెళ్లి బంధంతో ఒకటవ్వాలని నిర్ణయించుకుని పెద్దలకు ఈ విషయాన్ని చెప్పేశారు. ఆ క్రమంలోనే ఇటీవలే వెంకీ సోదరుడు నిర్మాత డి.సురేష్ బాబు అబ్బాయి ఇంటికి వెళ్లి వివాహానికి సంబంధించి మాటా మంతీ సాగించారట. వెంకీ ప్రస్తుతం `ఎఫ్-2` చిత్రీకరణ కోసం `ప్రేగ్` వెళ్లారు. అక్కడ చిత్రీకరణ ముగించుకుని త్వరలో తిరిగి హైదరాబాద్ కి విచ్చేస్తున్నారు. వెంకీ రాగానే అశ్రిత నిశ్చితార్థ వేడుక ఉంటుందని తెలుస్తోంది.

అశ్రిత ప్రొఫెషనల్ బేకర్. బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకున్నారు. `ఇన్ ఫినిటీ ప్లేటర్` పేరుతో హైదరాబాద్ నగరంలో పలు స్టాల్స్ ని నిర్వహిస్తున్నారు. రామానాయుడు స్టూడియోస్ లోనూ ఈ తరహా స్టాల్ ఒకటి నిర్వహణలో ఉంది. ఇక అశ్రిత ప్రేమించిన యువకుడు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామి రెడ్డి కుమారుడు - సురేందర్ రెడ్డి మనవడు అని తెలుస్తోంది. ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుందిట.

Source: DeccanChronicle