Begin typing your search above and press return to search.

గురుపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు

By:  Tupaki Desk   |   28 March 2017 5:48 PM GMT
గురుపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు
X
వెంకటేష్ మూవీ గురు కోసం బాక్సాఫీస్ బాగానే ఎదురుచూస్తోంది. సమ్మర్ సీజన్ కావడంతో.. పలు చిత్రాలు వరుసగా క్యూ కట్టేయగా.. ఈ శుక్రవారం నాడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో గురుపై ట్రేడ్ జనాల్లో కూడా బోలెడంత ఆసక్తి కనిపిస్తోంది.

ఫిషర్ ఉమన్ నుంచి.. బాక్సింగ్ ఛాంపియన్ ఎదిగే అమ్మాయిగా రితికాసింగ్.. ఆమెకు ట్రైనర్ పాత్రలో వెంకటేష్ నటించిన నటించిన ఈ మూవీ.. తమిళ సూపర్ హిట్ సాలాఖద్దూస్ కి రీమేక్. మిడిల్ ఏజ్డ్ కోచ్ పాత్రలో వెంకటేష్ నటన.. ఇప్పటికే ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ గెటప్ లో.. వెంకీ కొత్తగా కనిపించబోతున్నాడు కూడా. మొదట ఏప్రిల్ లో గురు విడుదల చేద్దామని భావించిన నిర్మాతలు.. ఇప్పుడు మార్చ్ 31కే తెరపైకి తెచ్చేస్తున్నారు. అయితే.. ఫ్యాన్స్ ఆఫర్స్ వస్తున్నా సరే.. గురును మాత్రం విక్రయించడంలేదు నిర్మాత సురేష్ బాబు. థియేట్రికల్ రైట్స్ ను ఇవ్వకుండా.. తనే సొంతగా రిలీజ్ చేసేసుకోవడం చూస్తే.. ఈ మూవీపై నిర్మాత కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్దమవుతుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్.. గురుపై అంచనాలను పెంచేయగా.. ఇప్పుడు సొంతగా రిలీజ్ చేసుకోవడం చూస్తే.. మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోతున్నాయి. సమ్మర్ సీజన్ కి ఈ కంటెంట్ కూడా కలిసొచ్చిందంటే.. ఇక కలెక్షన్స్ వర్షం కురిసేయచ్చు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/