Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్?

By:  Tupaki Desk   |   1 Jan 2019 9:27 AM GMT
బిగ్ బాస్ సీజ‌న్ 3 హోస్ట్?
X
పాశ్చాత్య వాసన‌ల `బిగ్ బాస్ రియాలిటీ` భార‌త‌దేశంపై కంచె వేసిన సంగ‌తి తెలిసిందే. వాళ్లు మొద‌లు పెట్టిన పిచ్చి రియాలిటీ షో తెలుగింటి లోగిళ్ల‌లోకి పాకిపోయింది. ఇది ఎంత పిచ్చి ప్ర‌కోపించే కార్య‌క్ర‌మం అనుకున్నా, దీనికి తెలుగు నాట మాస్ లో ఆద‌ర‌ణ దక్కుతోంది. అందుకే రెండు సీజ‌న్ల‌ను స్టార్‌- మా చానెల్ దిగ్విజ‌యంగా న‌డిపించింది. తొలి సీజ‌న్‌ని యంగ్ య‌మ ఎన్టీఆర్ హోస్ట్ గా ర‌క్తి క‌ట్టించారు. దాంతో ఆ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని హోస్టింగ్ చేసిన షో కూడా కొన్ని విమ‌ర్శ‌ల న‌డుమ విజ‌య‌వంతంగానే ముగిసింది. వారం వారం గంట‌ల కొద్దీ స‌మ‌యం వెచ్చించి జ‌నం టీవీల‌కు క‌ళ్ల‌ప్ప‌గించారంటే ఇందులో ఏదో ఉంద‌నే అర్థం.

ఇక‌పోతే బిగ్ బాస్ సీజ‌న్ 3 జూన్‌లో మొద‌లు కానుంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి నుంచే కొత్త సీజ‌న్ కి సంబంధించిన ప‌నుల్ని `స్టార్ మా` ప్రారంభించింది. అయితే ఈసారి ప్రారంభం కాబోయే సీజ‌న్ 3 బిగ్ బాస్ హోస్ట్ ఎవ‌రు? అంటే ప్ర‌స్తుతానికి విక్ట‌రీ వెంక‌టేష్ తో మంత‌నాలు సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే వెంకీ ఇప్ప‌టివ‌ర‌కూ బుల్లితెర‌పై హోస్టింగ్ చేసిందే లేదు. ఆయ‌న‌కు ఇక్క‌డ అనుభ‌వం జీరో. అప్పుడ‌ప్పుడు ఇంట‌ర్వ్యూల్లో పాల్గొన‌డం, ఏవైనా స‌ర‌దా కార్య‌క్ర‌మాలతో అల‌రించ‌డం త‌ప్ప పెద్ద‌గా బుల్లితెర యాంక‌రింగ్ అనుభ‌వం లేదు.

అయితే సీనియ‌ర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి - కింగ్ నాగార్జున బుల్లితెర హోస్టులుగా అభిమానుల్ని మెప్పించారు. అదే త‌ర‌హాలో వెంకీ కూడా బుల్లితెరపైకి వ‌స్తారా.. రారా? అన్న‌ది చూడాలి. స్వ‌త‌హాగానే భ‌క్తి- ముక్తి, యోగం అంటూ వివేకానంద పుస్త‌కాలు చ‌దివే వెంకీ ఇలాంటి కార్య‌క్ర‌మాల్ని ఎంట‌ర్ టైన్ చేస్తారా? వెంకీ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే క్రికెట్, క‌బడ్డీల్ని తెలుగు జ‌నం మ‌ర్చిపోయేలా, సంస్కృతికి తూట్లు పొడిచేలా బిగ్ బాస్ ప్ర‌కోపిస్తున్న వేళ ఇలాంటి వాటికి అత‌డు హోస్టింగ్ చేస్తారా? అన్న‌ది చూడాలి.