Begin typing your search above and press return to search.

F2లో ఇద్దరూ తోడల్లుళ్ళుగా..

By:  Tupaki Desk   |   19 Jun 2018 11:39 AM GMT
F2లో ఇద్దరూ తోడల్లుళ్ళుగా..
X
కామెడీ ఎంటర్టైనేమేంట్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు నో చెప్పరు. కొంచెం కామెడీ ఉంటె థియేటర్స్ కు రెండు సార్లు కూడా వచ్చేస్తారు. ఇటీవల కాలంలో యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఆ తరహాలో మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుసగా మూడు సినిమాలతో హిట్టు అందుకొని నాలుగవ సినిమాతో కూడా నవ్వించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో F2 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

వెంకటేష్ - వరుణ్ ఈ సినిమాలో నటిస్తుండడం అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్. ఇక వారిద్దరూ సినిమలో అన్నదమ్ముల్లా కనిపిస్తారట. అన్నదమ్ములు అంటే సొంత అన్నదమ్ములు కాదండోయ్.. కో-బ్రదర్స్.. అదేనండీ.. తోడి అల్లుళ్ళగా కనిపిస్తారట. ఇటీవల దర్శకుడు అనిల్ స్క్రిప్ట్ పనులను మొత్తం పూర్తి హెచేసుకున్నాడు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గానే సినిమా ఉండనుందట. ఇక ఈ నెల 23వ తేదీన సినిమా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ వేడుక ప్లాన్ చేసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు ఎండ్ అయిపోయాయి.

ఒక్కసారి మొదలైతే ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వకూడదు అని చిత్ర యూనిట్ పక్కా ప్లాన్ తో రెడీ అవుతోంది. జూన్ 30న రెగ్యులర్ షూటింగ్ ను హైదరాబాద్ లో స్టార్ట్ చేసి జూన్ 20 వరకు బ్రేక్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. సమంత వెంకటేష్ సరసన నటిస్తుండగా మెహ్రీన్ పీర్జాద వరుణ్ తేజ్ సరసన నటించనున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ సినిమాకు సంగీతం అందించనున్నారు.