Begin typing your search above and press return to search.

ఫన్ లో దూకేసిన వెంకీ అండ్ వరుణ్

By:  Tupaki Desk   |   15 April 2018 10:46 AM GMT
ఫన్ లో దూకేసిన వెంకీ అండ్ వరుణ్
X
యూత్ హీరోలతో మల్టీ స్టారర్స్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తున్న వెంకటేష్ రంగంలోకి దూకేసాడు. గురు తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీ ఆ మధ్య తేజ దర్శకత్వంలో రూపొందే ఆటా నాదే వేటా నాదేలో బిజీ అయినట్టు వార్తలతో పాటు గెటప్ కు సంబంధించి స్టిల్స్ కూడా బయటికి వచ్చాయి. కాని దాని అప్ డేట్స్ మాత్రం సడన్ గా ఆగిపోయాయి. ఫిదా-తొలిప్రేమలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేష్ చేయబోతున్న ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (ఎఫ్2)షూటింగ్ కాదు కాని స్క్రిప్ట్ ఫైనల్ చేయటం కోసం నిర్మాత దిల్ రాజు-దర్శకుడు అనిల్ రావిపూడిలతో కలిసి వెంకీ అండ్ వరుణ్ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో కలిసి మరో సినిమా చేయబోతున్న వెంకీ దాని కంటే ముందు ఇదే స్టార్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయినట్టు టాక్.

దర్శకుడు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతోంది. తీసిన మూడు సినిమాలు పటాస్-సుప్రీమ్-రాజ ది గ్రేట్ ఒకదాన్ని మించి ఒకటి కమర్షియల్ హిట్స్ గా నిలవడంతో ఇప్పుడు డీల్ చేయబోయే మల్టీ స్టారర్ అంతకు రెట్టింపు వినోదంతో ఉండబోతోంది అని ఇన్ సైడ్ టాక్. హీరొయిన్స్-టెక్నికల్ టీంకి సంబంధించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వినోదంతో పాటు మంచి యాక్షన్ కూడా ఇందులో మిక్స్ చేసినట్టు టాక్. వెంకటేష్ మెగా హీరోతో కలిసి నటించడం ఇది రెండో సారి. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాలా ఆల్రెడీ చేసాడు. ఇప్పుడు అబ్బాయి వరుణ్ తేజ్ తో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ మూవీ ఫాస్ట్ అండ్ ఫ్యురియాస్ కు పేరడీలా అనిపిస్తున్న ఈ టైటిల్ అక్కడి నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. షూటింగ్ త్వరగా ఫినిష్ చేసి దసరా లేదా దీపావళికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు వినికిడి.