ఫోటో స్టొరీ: ఏడిపించుకుంటున్న తోడల్లుళ్ళు!

Mon Dec 10 2018 22:39:44 GMT+0530 (IST)

విక్టరీ వెంకటేష్.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి పండగకు తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన ఈ సినిమా నుండి తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు అనిల్ రావిపూడి అండ్ టీం.ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ అండ్ టైమ్ తెలపుతూ విడుదల చేసిన ఈ పోస్టర్ లో మొత్తం ఎనిమిది పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.. మధ్యలో ఒక టైటిల్ లోగో ఉన్నాయి. మొదటి వరుసలో ఉన్న మూడు ఫోటోలలో వెంకీ తన తోడల్లుడైన వరుణ్ ను ఏడిపిస్తూ హ్యాపీ పోజ్ పెడితే వరుణ్ మాత్రం కోపంగా ఉన్నాడు. ఇక రెండో వరుసలో తన ఫ్రస్ట్రేషన్ కు కు కారణం.. తోడల్లుడి ఫన్ కు కారణం అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక మూడో వరస వచ్చేసరికి వరుణ్ ఒక వింత ఆలోచనతో వస్తే వెంకీ  కి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు.

మరి ఈ ఫోటోల అంతరార్థం తెలియాలంటే డిసెంబర్ 12 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ వేచి చూడాలి. ఎందుకంటే ఆ టైమ్ లో 'ఎఫ్ 2' టీజర్ రిలీజ్ అవుతుంది కాబటి. అప్పుడే మనకు ఈ సంక్రాంతి అల్లుళ్ళ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ కు కారణం తెలిసే అవకాశం ఉంది.