Begin typing your search above and press return to search.

ఈ కొత్త సినిమా పోస్టరేదో బాగుందే..

By:  Tupaki Desk   |   3 Dec 2016 6:24 AM GMT
ఈ కొత్త సినిమా పోస్టరేదో బాగుందే..
X
వెంకటాపురం.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరుతో ఒక పోస్టర్ హల్ చల్ చేస్తోంది. పోస్టర్ మీద ఒక కుర్రాడి ముఖం డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తోంది. కానీ ఆ కుర్రాడెవరన్నది తెలియట్లేదు. పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. ఆ కుర్రాడు మరెవరో కాదు.. ‘హ్యాపీడేస్’ సినిమాలో టైసన్ పాత్రలో కనిపించిన రాహుల్. చివరగా ‘లవ్ యు బంగారం’ సినిమాలో హీరోగా నటించిన రాహుల్.. తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఇప్పుడు మళ్లీ ‘వెంకటాపురం’ అనే థ్రిల్లర్ మూవీలో కనిపించబోతున్నాడు.

ఇంతకుముందు ‘ఈ రోజుల్లో’తో పాటు మరో రెండు సినిమాలు నిర్మించిన గుడ్ సినిమా గ్రూప్ ‘వెంకటాపురం’ చిత్రాన్ని నిర్మిస్తోంది. వేణు మడికంటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మహిమా అనే కొత్తమ్మాయి కథానాయికగా పరిచయమవుతోంది. ‘హ్యాపీడేస్’ సినిమా తర్వాత రాహుల్ సోలో హీరోగా ‘రెయిన్ బో’ అనే సినిమా చేశాడు. అది ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ‘ముగ్గురు’తో పాటు ‘ప్రేమ ఒక మైకం’.. ‘లవ్ యు బంగారం’ లాంటి సినిమాల్లో నటించాడు రాహుల్. ఈ సినిమాలన్నీ నిరాశ పరిచాయి. ఐతే ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘వెంకటాపురం’ చేశాడు. టైటిల్.. పోస్టర్ చూస్తుంటే సినిమా మీద క్యూరియాసిటీ పెంచేలాగే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/