కొత్త మార్కెటింగ్ ఐడియా ఇచ్చిన చిన్న సినిమా

Thu May 18 2017 12:29:14 GMT+0530 (IST)

చిన్న సినిమా అయన వెంకటాపురం పోస్టర్ తో మంచి మార్కెట్ చేసింది. హ్యాపీడేస్ ఫేమ్ రాహుల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా గత వారం విడుదలైంది. ఈ సినిమా ప్రచారం ఆ స్థాయిలో ఎక్కడ చేయకపోయినా పోస్టర్ ఎఫెక్ట్ బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ వెంకటాపురం మేకర్స్ ఇంకో కొత్త మార్కెటింగ్ ప్రయోగం చేయగా.. అది కూడా వర్క్ ఔట్ అయినట్లుగానే ఉంది.

సినిమా మొదటి ఎనిమిది నిమిషాలు యూట్యూబ్లో నేరుగా విడుదల చేసారు. ఇలా ఒక సినిమా మొదట కొన్ని నిమిషాలు ఫ్రీగా చూపించడం అనే ట్రెండ్ ఈ మధ్య బాగానే నడుస్తోంది. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. మేకర్స్ అందరూ ఉమ్మడిగా తీసుకున్న ఈ డెసిషన్.. మార్కెట్ పరంగా బాగానే వర్కవుట్ అవుతోంది. చిన్న సినిమా మేకర్స్ కు కొత్త ఆలోచనలు రేకెత్తించింది. గతంలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలను రెండింటికి ఇలాగే తొలి 10 నిమిషాలూ రిలీజ్ చేశాడు. ఆ తరువాత బిచ్చగాడు బేతాళుడు సినిమాలకు కూడా అదే ఫాలో అయ్యారు.

ఇక వెంకటాపురం విషయానికి వస్తే.. ఎనిమిది నిమిషాలు చూసిన వారికి పూర్తి సినిమా చూడాలనే ఆరాటం ఉంటుందనేది నిర్మాతల ప్లాన్. ఈ ఐడియా బాగానే ఫలించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సినిమా కూడా థ్రిల్లర్ కావడం ఇటువంటి మార్కెటింగ్ వర్కవుట్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. చూద్దాం ఏమవుతుందో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/