Begin typing your search above and press return to search.

రాజమౌళి ప్లేస్ ఆయన తీసుకున్నాడులే

By:  Tupaki Desk   |   27 Feb 2017 6:57 AM GMT
రాజమౌళి ప్లేస్ ఆయన తీసుకున్నాడులే
X
ఒక ప్రక్కన గత నాలుగేళ్ళ నుండి బాహుబలి సినిమాతో బాగా బిజీగా ఉన్న రాజమౌళికి ఒక అలవాటు ఉంది. రిలీజైన దాదాపు పెద్ద సినిమాలన్నింటినీ చూడటం.. వాటికి ఆయన రివ్యూలు ఇవ్వడం పరిపాటి అయిపోయింది. దాదాపు ఆయన ట్విట్టర్ టైమ్ లైన్ అంతా కూడా ఈ రివ్యూలతోనే నిండి ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు రాజమౌళి ప్లేస్ మరో పెద్దాయన తీసుకుంటున్నారు తెలుసా?

మొన్నటివరకు రాజకీయాల్లోనే బాగా యాక్టివ్ గా ఉన్న మంత్రి వెంకయ్య నాయుడు ఇప్పుడు సినిమాల్లో కూడా బాగా బిజీగా ఉంటున్నారు. ఆయన వీలునప్పుడల్లా.. అబ్బే కాదు.. దాదాపు వీలు చేసుకుని అన్ని సినిమాలనూ చూసేస్తున్నారు. ఆ మధ్యన శాతకర్ణి సినిమాను చూసి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పెషల్ గా నాలుగు వాక్యాలు చెప్పిన వెంకయ్య.. ఇప్పుడు ఘాజీ సినిమా గురించి కూడా ఇలాగే రివ్యూ ఒకటి సమర్పించుకున్నారు. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కెజ్రివాల్ తన ట్వీట్లలో సినిమాల గురించి చెప్పేవారు. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఏకంగా వీడియో రివ్యూలే ఇచ్చేస్తున్నారు. మొత్తనికి ఆ విధంగా వెంకయ్య ఇప్పుడు రాజమౌళి ప్లేస్ ను కొట్టేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/