Begin typing your search above and press return to search.

పోస్టర్ టాక్: మెరుపు తీగ‌లా క‌రీనా

By:  Tupaki Desk   |   24 April 2018 2:29 PM GMT
పోస్టర్ టాక్: మెరుపు తీగ‌లా క‌రీనా
X
జీరో సైజ్ తో అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది క‌రీనా క‌పూర్‌. త‌రువాత సైఫ్‌ తో పెళ్ల‌యినా కూడా అదే ఫిగ‌ర్ మెయింటేన్ చేసింది. తైమూర్‌ కు జ‌న్మ‌నిచ్చాక మాత్రం బొద్దుగా మారింది. మ‌ళ్లీ మెరుపుతీగ‌లా మార‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది. ఈ ఫోటో చూస్తే ఆ క‌ష్టం ఫ‌లించిన‌ట్టే ఉంది. హాలీవుడ్ మెరుపు తార‌లా స‌న్న‌గా గ్లామ‌ర‌స్‌ గా త‌యారైంది. మ‌ళ్లీ జోరుగా సినిమాలు చేసేందుకు సిద్ద‌మైపోయింది.

ముప్పై ఏడేళ్ల క‌రీనా ముద్దుల కొడుకు తైమూర్‌. త‌ల్ల‌వ్వ‌డానికి ఎంత ప్రాధాన్య‌త‌నిచ్చిందో మ‌ళ్లీ స్లిమ్ గా మార‌డానికి కూడా అంతే ప్రాధాన్య‌త‌నిచ్చింది క‌రీనా. గంట‌లు గంట‌లు జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేసింది. ప్ర‌ముఖ సెలెబ్రిటీ డైటీషియ‌న్ న‌మ్ర‌తా పురోహిత్ ఆధ్వ‌ర్యంలో క‌ఠిన‌మైన డైట్ పాటిస్తూ కొవ్వును క‌రిగించింది. ఇంత క‌ష్ట‌ప‌డింది క‌నుకే ఇప్పుడు స‌న్న జాజి తీగ‌లా క‌నిపిస్తోంది. తైమూర్ పుట్టిన తరువాత కరీనా.. శషాంక్ ఘోష్ దర్శకత్వంలో  ‘వీరే ది వెడ్డింగ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా వచ్చే జూన్ 1న‌ విడుదల కానుంది. ఈ సినిమాలో కరీనాతో పాటు సోనమ్ కపూర్, స్వర భాస్కర్, షికా తల్సానియా కూడా న‌టిస్తున్నారు.

ఆ సినిమా పోస్ట‌ర్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. అందులో క‌రీనా లుక్ అదిరిపోయింది. అమ్మ‌యినా కూడా ఇంకా పాతికేళ్ల పిల్ల‌లాగే క‌నిపిస్తోంది. హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్ ఉంది. పెళ్లి పిల్లలు అందానికి కెరీర్‌కు అడ్డుకావ‌ని నిరూపిస్తోంది క‌రీనా. ఆమె స్పీడుకు ఇక బ్రేకులెయ్య‌డం ఎవ‌రికైనా క‌ష్ట‌మే. వీరే ది వెడ్డింగ్ ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.