జపాన్ నుంచి విసిరిన అందాల 'బాణం'

Thu Apr 20 2017 10:41:04 GMT+0530 (IST)

బాణం మూవీలో నారా రోహిత్ పక్కన హీరోయిన్ గా నటించింది అందాల భామ వేదిక. అంతకు ముందే విజయదశమి అనే కళ్యాణ్ రామ్ మూవీలో కూడా లీడ్ హీరోయిన్ రోల్ చేసింది కానీ.. గుర్తింపు వచ్చిన మూవీ అయితే మాత్రం అదే. అ తర్వాత సుమంత్ తో దగ్గరగా దూరంగా అనే చిత్రంలో కనిపించింది.

అమ్మడికి అసలు సిసలైన బ్రేక్ మాత్రం 2013లో బాల దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం పరదేశిలో అంగమ్మ పాత్రతో వచ్చింది. ఆ రోల్ తెచ్చిన గుర్తింపు తర్వాత.. కేరక్టర్స్ ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్న వేదిక.. ప్రస్తుతం తెలుగు మినహాయిస్తే.. సౌత్ లోని అన్ని భాషల్లోనూ సినిమాలు చేసేస్తోంది. తాజాగా ఈ సుందరి జపాన్ దేశానికి టూర్ వెళ్లింది. టోక్యో నగరంలో గ్రీనరీ అందాలను చూసి ముగ్ధురాలైపోయిన ఈ ముగ్ధ.. ఆ పచ్చదనంతో ప్రేమలో పడిపోయానంటూ.. ఓ ఫోటో తీయించుకుని మరీ షేర్ చేసింది.

స్లీవ్ లెస్ టాప్ లో.. మెరుస్తున్న కాలి అందాలతో.. అమ్మడు ఇచ్చిన పోజ్ అదిరింది కానీ.. టోక్యో అందాలతో ప్రేమలో పడిపోయానని వేదిక చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే.. ఇంతలేసి చూపిస్తున్నా అమ్మడి అందాల కంటే ప్రకృతి అందమే కళ్లను మైమరిపించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/