Begin typing your search above and press return to search.

తమన్నా..ఈ దెబ్బతో బిజీ అయిపోతుందా?

By:  Tupaki Desk   |   1 Aug 2015 7:32 AM GMT


ఏంటో తమన్నా కెరీర్.. ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుంది. ఆమెకు హిట్లు లేవని కాదు కానీ.. ఆ హిట్ల తాలూకు క్రెడిట్ కొంచెం కూడా ఆమెకు దక్కట్లేదు. తాజాగా బాహుబలి సినిమానే తీసుకుంటే.. ప్రశంసలన్నీ రాజమౌళి అండ్ కోకు వెళ్తుంటే విమర్శలన్నీ తమన్నా ఖాతాలోకి చేరిపోయాయి. ఆమె క్యారెక్టర్ వేస్ట్ అని.. రౌద్రం చూపించలేకపోయిందని.. ఇంకా ఏవేవో విమర్శలొస్తున్నాయి. ఆమె క్యారెక్టర్ వివాదానికి కూడా కారణమవుతోంది. మరోవైపు తమిళంలో కూడా తమన్నా కెరీర్ ఏమంత గొప్పగా లేదు. గత ఏడాది ఆమె నటించిన ‘వీరం’ సినిమా హిట్టయింది అందులోనూ ఆమెది అల్లాటప్పా క్యారెక్టరే. సరైన గుర్తింపు రాలేదు.

ఐతే కోలీవుడ్ లో కొంచెం గ్యాప్ తీసుకుని ఆర్య సరసన ఆమె చేసిన ‘వాసువునుం సరవనవనుం ఒన్నా పడిచవంగ’ అనే సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఎస్ఎంఎస్, బాస్ ఎన్గిర భాస్కరన్ (నేనే అంబాని), ఓకే ఓకే లాంటి కామెడీ ఎంటర్టైనర్స్ తీసిన రాజేశ్ ఈ సినిమాకు దర్శకుడు. ఆర్యతో పాటు సంతానం ముఖ్య పాత్ర పోషించాడు. తమన్నా ఆర్యకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో తమ్మూ చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. గ్లామర్ డోస్ పెంచి అభిమానులకు గాలం వేస్తోంది. ట్రైలర్ కూడా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండటంతో సినిమా హిట్టవడం ఖాయమే అనిపిస్తోంది. ట్రైలర్లో సంతానం ఓ తెలుగు డైలాగ్ కూడా చెప్పడం విశేషం. ఆర్యకిది 25వ సినిమా కావడంతో సినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు కూడా. ఈ సినిమా హిట్టయితే తన కోలీవుడ్ కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందని.. అక్కడ బిజీ అయిపోవచ్చని ఆశతో ఉంది తమ్మూ. ఆమె ఆశ నెరవేరుతుందేమో చూద్దాం.