Begin typing your search above and press return to search.

పునర్నవిపై వరుణ్ ఫైర్..లవ్ క్లాస్ చెప్పిన బాబా..

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:00 AM GMT
పునర్నవిపై వరుణ్ ఫైర్..లవ్ క్లాస్ చెప్పిన బాబా..
X
ఈ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. సోమవారం ప్రారంభమైన ఎలిమినేషన్ ప్రక్రియ.. మంగళవారం ఎపిసోడ్లో కూడా కొనసాగింది. ఒక ఇంటి సభ్యుడు ఇంకొకరి కోసం త్యాగాలు చేయడంతో ఎక్కువ మంది సేఫ్ జోన్‌లోకి వెళ్లారు. అయితే సరైన త్యాగాలు చేయకపోవడం వల్ల మహేశ్ - రాహుల్ ఎలిమినేషన్ లోకి వచ్చారు. చివరికి కెప్టెన్ గా ఉన్న వితికా.. హిమజని నేరుగా నామినేట్ చేసింది. దీంతో ఈ వారం మహేశ్ - రాహుల్ ,హిమజ ఎలిమినేషన్‌ కు నామినేట్ అయ్యారు.

ఈ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పునర్నవి - వరుణ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. వితికా... హిమజని నామినేట్ చేయకముందు వరుణ్ పేడ నీళ్ళలో పడుకునే టాస్క్ చేసి హిమజని సేఫ్ చేశాడు. అయితే హిమజ కోసం అలా చేయడం పట్ల పునర్నవి అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో వరుణ్ మాట్లాడుతూ... శ్రీముఖి తన కోసం పచ్చబొట్టు పొడిపించుకుంది అని.... అది లైఫ్ లాంగ్ ఉంటుందని అలాంటిది ఒక వ్యక్తిని సేఫ్ చేయడానికి పేడలో పడుకోవడం తప్పు అనిపించలేదని చెప్పాడు.

అయినా హిమజను సేవ్ చేసిన దగ్గర నుండి యాటిట్యూట్ చూపిస్తున్నావ్.. పేడలో పడుకుంది నేను కదా.. నువ్ కాదు కదా.. నువ్ ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావ్ ’ అంటూ పునర్నవికి వరుణ్ క్లాస్ పీకారు.ఇక నెక్స్ట్ డే బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఓ సరదా టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ కాలేజ్ స్కిట్ ఇచ్చారు. ఇందులో లవ్ గురించి చెప్పే లెక్చరర్ గా బాబా భాస్కర్, గాసిప్స్ లెక్చరర్ గా వితికా - ‘చిల్’ గా ఉండే లెక్చరర్ గా వరుణ్ ఉన్నారు.

బాబా లవ్ లెక్చరర్ గా ఫుల్ కామెడీ చేశాడు. ముఖ్యంగా రాహుల్ - పునర్నవి మధ్య కెమిస్ట్రీ గురించి సరదాగా వివరించారు. అలాగే వితికా గాసిప్స్ ఎలా సృష్టించాలో చెప్పగా....వరుణ్....కూల్ ఎలా ఉండాలో చెప్పాడు. ఈ స్కిట్ గురువారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది.