Begin typing your search above and press return to search.

మెగా హీరో వేగాస్‌ ఎందుకెళ్ళాడో..

By:  Tupaki Desk   |   26 May 2016 9:27 AM GMT
మెగా హీరో వేగాస్‌ ఎందుకెళ్ళాడో..
X
ఇప్పుడు మెగా హీరో వరుణ్‌ తేజ్.. అమెరికాలోని లాస్‌ వేగాస్‌ లో ఎంజాయ్‌ చేస్తున్నాడు తెలుసా. వేగాస్ అంటేనే పార్టీయింగ్‌. మరి మనోడు సడన్‌ గా సమ్మర్‌ హాలిడేస్‌ తీసుకొని అక్కడికి ఎందుకు వెళ్ళినట్లో?

నిజానికి కంచె సినిమా రిలీజైనప్పటి నుండీ తన తదుపరి సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడా అని అందరూ చూస్తుంటే.. వరుణ్‌ మాత్రం గోవా ట్రిప్‌.. ఆ ట్రిప్‌ ఈ ట్రిప్‌ అంటూ టైమ్ పాసింగ్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు శ్రీను వైట్ల సినిమా ''మిష్టర్‌'' మొదలెట్టాల్సి ఉన్నా కూడా.. మనోడు అందరికీ వీసాలు ఇంకా రాలేదు కాబట్టి.. అప్పటివరకు ఏదైనా రెస్ట్ తీసుకుందాం అని ఫిక్సయ్యాడట. ఇంతలో అమెరికాలో నాటా వారు.. మనోడ్ని గెస్టు క్రింద ఆహ్వానించారు. ఇంకేముంది.. హ్యాపీగా కాస్త ముందుగానే అమెరికా వెళిపోయి.. అక్కడే ఎంజాయ్‌ చేస్తున్నాడు. త్వరలోనే నాటా ఈవెంట్లను కూడా ఫినిష్‌ చేసుకుని తిరిగి వచ్చేస్తాడట.

అదంతా సరే.. ముందు మిష్టర్‌.. ఆ తరువాత శేఖర్‌ కమ్ముల సినిమా త్వరగా మొదలెట్టి.. కనీసం సంవత్సరానికి రెండు సినిమాలైనా రిలీజయ్యేలా మనోడు చూసుకుంటే బెటర్. కాదంటారా?