Begin typing your search above and press return to search.

ఐతే వరుణ్ యుద్ధం చేసేది అందుకున్నమాట

By:  Tupaki Desk   |   1 Sep 2015 7:52 AM GMT
ఐతే వరుణ్ యుద్ధం చేసేది అందుకున్నమాట
X
గన్ను పట్టుకుని కదన రంగంలో చెలరేగిపోయాడు వరుణ్ తేజ్. నిమిషం సాగే ‘కంచె’ ట్రైలర్ తోనే వావ్ అనిపించాడు క్రిష్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే లవ్ స్టోరీతో పెద్ద రిస్కే చేయబోతున్నాడు క్రిష్. అప్పటి వాతావరణాన్ని తెరమీద ప్రతిబింబింపజేయడం అంటే మాటలు కాదు. ప్రతి చిన్న విషయంలోనూ కేర్ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. సీరియస్ సినిమా కాబట్టి.. కంటెంట్ విషయంలోనూ చాలా బలంగా ఉంటే తప్ప ఇప్పటి ఆడియన్స్ కు ఎక్కడం అంత ఈజీ కాదు. ఐతే క్రిష్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు జాగర్లమూడి రాధాకృష్ణ. చాలా ఖర్చుతో, శ్రమతో కూడుకున్న సినిమాను చాలా తక్కువ టైంలో పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేశాడు. ఇంకో నెల రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

బుధవారం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ రోజు కంచె ట్రైలర్ రిలీజవబోతోంది. ధూపాటి హరిబాబు, సీతాదేవిల ప్రణయం తాలూకు శాంపిల్ ను ట్రైలర్ లో చూపిస్తున్నారు. దీనికంటే ముందు హీరో హీరోయిన్ల కొత్త లుక్స్ రిలీజ్ చేశాడు క్రిష్. ఇప్పటిదాకా కనిపించీ కనిపించకుండా ముఖం దాచేసిన హీరోయిన్ ను తాజా లుక్ లో బాగా చూపించాడు. చాలా అందంగా ఉందా అమ్మాయి. ట్రైలర్ గురించి ప్రస్తావిస్తూ వరుణ్ తేజ్ ఓ ఆసక్తికరమైన సంగతి చెప్పాడు. సీతా దేవి ప్రేమ కోసం ధూపాటి హరిబాబు యుద్ధానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్నదే ఈ కథాంశం అని వెల్లడించాడు. అంటే ప్రేమ కోసమే ప్రపంచ యుద్ధానికి వెళ్తాడన్నమాట హీరో. ఈ పాయింట్ వింటుంటే ‘కంచె’ ఈజీగా ప్రేక్షకులకు కనెక్టయ్యేలాగే ఉంది. చూద్దాం క్రిష్ ఏం చూపిస్తాడో!