Begin typing your search above and press return to search.

అబ్బాయా అల్లుడా పవన్?

By:  Tupaki Desk   |   20 Nov 2018 7:41 AM GMT
అబ్బాయా అల్లుడా పవన్?
X
నిన్న మధ్యాన్నం పవన్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తుపాకి సైట్ వెలుగులోకి తేవడం ఆలస్యం ఆ వార్త వైరల్ గా మారిపోయి పవన్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఎస్ ఆర్టి బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించే సినిమాలో నలభై నిమిషాల పాటు వచ్చే పవర్ ఫుల్ ఎపిసోడ్ లో పవన్ రచ్చ ఉంటుంది అని తెలియడంతో అప్పుడే దీని గురించి రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. పవన్ స్పెషల్ రోల్ కాబట్టి హీరో ఎవరు ఉంటారు అనే అనుమానం రావడం సహజం.

మెగా కాంపౌండ్ కథానాయకుడే ఉంటాడు అనే టాక్ ఉన్నప్పటికీ ఎవరా అనే సస్పెన్స్ మాత్రం తెరపడలేదు. విశ్వసనీయమైన సమాచారం మేరకు రెండు పేర్లు గట్టిగా విన్పిస్తున్నాయి. ఒకటి పవన్ అన్నయ్య అబ్బాయి వరుణ్ తేజ్ కాగా రెండోది మేనల్లుడు సాయి ధరం తేజ్. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరు చేస్తారు అనే అంచనాలు అప్పుడే మొదలైపోయారు. ఒకవేళ అడిగితే ఎవరూ కాదనరు. అంతరిక్షం-ఎఫ్2 షూటింగ్స్ ఎలాగూ పూర్తవుతున్నాయి కాబట్టి వరుణ్ తేజ్ ఖాళీనే. తేజు ఒక్క చిత్రలహరి మాత్రమే చేస్తున్నాడు. సో ఛాన్స్ ఇద్దరికీ సమానంగా ఉంది. సో ఎవరైనా ఉండొచ్చు.

కాకపోతే ఈ సినిమా ఎన్నికల ముందే వచ్చే ఛాన్స్ ఉందా లేక తర్వాత చేస్తారా అనే క్లారిటీ మాత్రం ఇప్పటికి లేదు. అభిమానులు మాత్రం పవన్ ఎంత సేపు కనిపిస్తాడు అనే దాని కన్నా రీ ఎంట్రీ పక్కా అనే వార్తే బాగా కిక్కిస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనసేనలో ఊపిరిసలపంత బిజీగా ఉన్న పవన్ ఎంతవరకు కాల్ షీట్స్ కేటాయించగలడు అనే దాని మీద విడుదల తేదీ ఆధారపడి ఉంటుంది. ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే దాకా ఈ సందిగ్దత తప్పదు