Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: అదే రొటీన్ మిష్టరూ!!

By:  Tupaki Desk   |   22 March 2017 12:51 PM GMT
ట్రైలర్ టాక్‌: అదే రొటీన్ మిష్టరూ!!
X
దర్శకుడు శ్రీను వైట్ల గత కొంతకాలంగా రొటీనో చింతకాయో పచ్చడియో అనే కొత్త టాపిక్ పైనే సినిమాలు తీస్తున్నాడు. అందుకే ఆగడు.. ఆ తరువాత బ్రూస్ లీ అంటూ వరుసగా పంచ్ లు మీద పంచ్ లు తినేశాడు. ఇప్పుడు వరుణ్‌ తేజ్ తో ''మిష్టర్'' అంటూ మళ్ళీ దిగుతున్నాడు. ఈ సినిమా త్వరలోనే విడుదలవుతుండగా.. ట్రైలర్ ఇవాళే రిలీజైంది.

యాజిటీజ్ గా.. ఒక ఆనందం సినిమాలోని హిల్ స్టేషన్ లుక్.. ఒక రెడీ సినిమాలోని కామెడీ.. ఒక నమో వెంకటేశలో ఉన్న ఫ్యాక్షన్ చేజులు.. ఒక దూకుడులో ఉన్న ఫైట్లు.. అన్నీ కలగలపి శ్రీను వైట్ల గత సినిమాల్లోని సీన్లన్నీ తీసుకుని ఒక ట్రైలర్ కట్ చేస్తే.. అదే ''మిష్టర్'' అని చెప్పొచ్చు. మోడ్రన్ లుక్ లో ఒక హీరోయిన్.. వెస్ర్టన్ లుక్ లో ఒక హీరోయిన్.. సగం సినిమాలో ఫారిన్లో.. సగం ఇండియాలోని ఒక విలేజ్ లో.. హీరో లుక్ మాత్రం హ్యాండ్సమ్ గా.. పక్కన పంచులు మాత్రం రొటీన్ గా.. ఏదో ఏదో అలా ఉంది మిష్టర్ ట్రైలర్. అందమైన లొకేషన్లు.. హీరో లుక్స్.. తప్పిస్తే పెద్దగా ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏవీ ఇందులో లేనేలేవు.

ఇప్పటికే ఏదో కొత్తగా ప్రయత్నిస్తాడని అనుకుంటే.. గోపిమోహన్ అండ్ శ్రీధర్ సీపాన వంటి రొటీన్ కథా రచయితలతో కూర్చుని మరో రొటీన్ కషాయాన్నే తయారుచేశాడు వైట్ల. మిక్కీ జే మేయర్ మ్యూజిక్.. అబ్బే పెద్దగా కిక్ లేదు. హీరోయిన్లు లావణ్య త్రిపాఠి అండ్ హెబ్బా పటేల్ లు.. సోసోగా ఉన్నారంతే. ఒకవేళ సినిమాలోని కామెడీ వర్కవుట్ అయితే ధియేటర్లలో సినిమా ఆడే ఛాన్సుంటుంది. లేకపోతే మాత్రం కష్టమే.