Begin typing your search above and press return to search.

ఎన్నాళ్ళకు శ్రీను వైట్ల మొహం చూపించాడో

By:  Tupaki Desk   |   30 July 2016 11:44 AM GMT
ఎన్నాళ్ళకు శ్రీను వైట్ల మొహం చూపించాడో
X

''ఆగడు'' సినిమా ఫ్లాపవ్వడంతో శ్రీను వైట్లకు మైండ్ బ్లాంక్ అయ్యింది. అప్పటివరకు వర్కవుట్ అయిన తన టెంప్లేట్ కామెడీలన్నీ ఒక్కసారిగా హ్యాండిచ్చాయి. కట్ చేస్తే సినిమా మహేష్‌ కెరియర్లో మరో దారుణ డిజాష్టర్ అయిపోయింది. ఆ తరువాత గ్యాప్ తీసుకుని.. మెగా హీరోతో రెండోసారి ఒక ప్రాజక్టు చేపట్టాడు. అదే ''బ్రూస్ లీ''. అబ్బే రిజల్టు మళ్ళీ సేమ్. దానితో మళ్ళీ మైండ్ బ్లాంక్.

అందుకే గత ఏడాది అక్టోబర్ లో బ్రూస్ లీ రిలీజైన తరువాత నుండి.. అసలు శ్రీను వైట్ల మీడియా ముందు మొహం చూపిస్తే ఒట్టు. ఎక్కడా ఎటువంటి పెద్ద పెద్ద అకేషన్లలో కూడా మనోడు కనిపించలేదు. అంతే కాదు.. అసలు తన ''మిష్టర్'' సినిమా గురించి కూడా ఒక్క మాటంటే ఒక్క మాట కూడా చెప్పలేదు. దాదాపు 9 నెలల తరువాత ఇప్పుడు తొలిసారిగా ఒక ఫోటోకు ఫోజిచ్చాడు వైట్ల. స్పెయిన్లో షూటింగ్ స్పాట్ నుండి.. మెగా హీరో వరుణ్‌ తేజ్ తో కలసి మనోడు ఒక చిరు నవ్వు నవ్వాడు. వీళ్ల కెమెరామ్యాన్ జయరాజ్ కూడా పక్కనే ఉన్నాడు చూడండి. ఈ ఫోటోను స్వయంగా వరుణ్‌ తేజ్‌ షేర్ చేశాడు.

ఈ మొహాలు చూపించడం వగైరా పట్టింపులు ఏముందిలే కాని.. ఇప్పుడు శ్రీను వైట్ల ఖచ్చితంగా హిట్టు కొట్టాల్సిన తరుణం వచ్చింది. లేకపోతే ఈ సినిమా తన హ్యాట్రిక్ ఫ్లాప్ మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీకి కూడా హ్యాట్రిక్ ఫ్లాపిచ్చినట్లే అవుతుంది. గతంలో అందరివాడు అండ్ బ్రూస్ లీ అంటూ రెండు మెగా ఫ్లాపులు తీశాడులే మనోడు. అది సంగతి.