Begin typing your search above and press return to search.

మంచు ఫ్యామిలీ కోసం పైసా తీసుకోకుండా...

By:  Tupaki Desk   |   29 Nov 2015 1:30 PM GMT
మంచు ఫ్యామిలీ కోసం పైసా తీసుకోకుండా...
X
తెలుగు పరిశ్రమలో దయార్ద్ర హృదయులు పెరిగిపోతున్నారు. ఇంకుముందు పారితోషకం కోసం నిర్మాతల్ని పీడించుకుతినే ఆర్టిస్టులు - టెక్నీషియన్ల గురించే విన్నాం కానీ.. ఈ మధ్య వరుసగా రెమ్యూనరేషన్లు తగ్గించుకోవడం.. సినిమాకు నష్టాలు వాటిల్లినపుడు కొంత వెనక్కివ్వడం.. అసలు రెమ్యూనరేషనే తీసుకోకుండా సినిమాలు చేయడం గురించి వార్తలు తరచుగా వింటున్నాం. ‘రుద్రమదేవి’ కోసం గుణశేఖర్ పడుతున్న కష్టాన్ని గుర్తించి అల్లు అర్జున్ పైసా పారితోషకం తీసుకోకుండా గోన గన్నారెడ్డి పాత్ర పోషించడం.. మరోవైపు సుకుమార్ కోసం ‘కుమారి 21 ఎఫ్’ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు పని చేయడం తెలిసిందే.

ఇప్పుడు ఈ జాబితాలోకి యువ కథానాయకుడు వరుణ్ సందేశ్ కూడా వచ్చాడు. మంచు ఫ్యామిలీ నిర్మాణంలో రాబోతున్న ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాలో నటించడానికి అతను పారితోషకం ఏమీ తీసుకోలేదట. ఈ సంగతి మంచు విష్ణునే స్వయంగా వెల్లడించాడు. ‘‘ఈ సినిమాలో వరుణ్.. మోహన్ బాబు కొడుకుగా నటించాడు. 15 రోజుల షూటింగ్ కోసం అతను యుఎస్ నుంచి వచ్చాడు. కానీ దీని కోసం ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు’’ అని విష్ణు చెప్పాడు. దీనిపై వరుణ్ మాట్లాడుతూ.. ‘‘విష్ణు ఫోన్ చేసి ఈ సినిమాలో నటించాలి అనగానే నేను కాదు అనలేకపోయాను. పాండవులు పాండవులు తుమ్మెద సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబు గారు నన్ను కొడుకులా చూసుకున్నారు. మామ మంచు అల్లుడ కంచు సినిమాలో నటించడం నాకు దక్కిన గౌరవం’’ అన్నాడు.