Begin typing your search above and press return to search.

ఒక్క ట్వీటుతో వరుణ్‌ చిక్కుల్లో పడ్డాడు

By:  Tupaki Desk   |   28 Sep 2016 6:45 AM GMT
ఒక్క ట్వీటుతో వరుణ్‌ చిక్కుల్లో పడ్డాడు
X
''పాకిస్తానీ యాక్టర్లను బ్యాన్ చేస్తే దేశంలో టెర్రర్ మొత్తం అంతం అవుతుంది అనుకుంటే.. భారత్ వెంటనే పాక్ నటులను బ్యాన్ చేయాలి'' అంటూ ట్వీటు వేశాడు బాలీవుడ్ హీరో వరుణ్‌ దావన్. మామూలుగా క్యూట్ గా ఉండే ఈ హీరో ఎప్పుడో అందరిచేత ప్రశంసలే అందుకుంటుంటాడు. కాని ఈ ఒక్క ట్వీట్ దెబ్బతో అసలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రాలింగ్ ఎలా ఉంటుందో రుచి చూశాడు. జనాలు విరుచుకుపడటంతో మైండ్ బ్లాంక్ అయిపోయింది.

పాక్ యాక్టర్లను సపోర్టు చేయడమే కాకుండా నోటికొచ్చినట్లు ట్వీట్లు పెడతావా అంటూ అందరూ ఫుట్ బాల్ ఆడేశారు. ఆ దెబ్బకి వెంటనే తన ట్వీటును డెలీట్ చేసేశాడు వరుణ్‌. ఈ మధ్యనే ఎం.ఎన్.ఎస్ సంస్థ పాక్ యాక్టర్లను అసలు ముంబయ్ లో తిరగనివ్వబోమని.. వారి షూటింగులను అడ్డుకుంటామని.. అలాగే వారి సినిమాలను కూడా అడ్డుకంటామని వార్నింగ్ ఇవ్వడంతో.. హీరో ఫవాద్ ఖాన్ సీక్రెట్ గా ఇండియా విడిచి పాక్ చెక్కేసిన అంశం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం కారణంగా యురి లో 16 మంది భారత్ సోల్జర్లు ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సదరు టెర్రరిజం గురించి చనిపోయిన భారత సేనల గురించి సెన్సిటివిటీ లేకుండా అసలు వరుణ్‌ కేవలం బాలీవుడ్ ను దృష్టిలో ఉంచుకుని ట్వీట్లు వేయడం సినిమా లవ్వర్లకు కోపం తెప్పించింది.

ఇకపోతే తన ట్వీట్ డెలీట్ చేసిన తరువాత వరుణ్ ఏమన్నాడంటే.. ''నా భావాన్ని మీరు తప్పుగా అర్దం చేసుకున్నారు. దేశంలో ఏం జరిగినా కూడా దాని ప్రభావం ఆర్ట్స్ మరియు స్పోర్ట్స్ మీద చూపిస్తున్నారు అనే ఉద్దేశ్యంతో చెప్పాను'' అంటూ సంజాయిషీ ఇచ్చాడు. ఏదేమైనా కూడా.. వరుణ్‌ కు పంచ్ పడిందంతే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/