Begin typing your search above and press return to search.

హీరోయిన్ కారులోనే హీరో అలా చేశాడే

By:  Tupaki Desk   |   25 Sep 2017 1:08 PM GMT
హీరోయిన్ కారులోనే హీరో అలా చేశాడే
X
సహజంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ మహా బిజీగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ టైంలో అయితే.. అనేక ప్రాంతాల్లో తెగ ప్రచారాలు చేసుకోవాలి. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ.. వీరి హంగామా మరింతగా పెరిగిపోతూ ఉంటుంది. పైగా ఓ ఈవెంట్ లో ఉన్న కాస్ట్యూమ్స్ తో మరో కార్యక్రమంలో కనిపించకూడదు. అందుకనే.. కార్వాన్ అందుబాటులో లేకపోతే.. అప్పుడప్పుడు తమ కారులోనే డ్రెస్ చేసేసుకుంటూ ఉంటారు.

ఇప్పుడు జుడ్వా-2 రిలీజ్ సందర్భంగా వరుణ్ ధావన్ ఫుల్ స్పీడ్ లో పబ్లిసిటీ యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాడు. ఇలాటి సమయంలోనే.. డ్రెస్ ఛేంజ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. పైగా పెద్దగా టైం కూడా లేదు. అందుకే హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కారును ఇందుకు వాడేశాడు. ఇలాంటివి అప్పుడప్పుడూ జరుగుతుంటాయ్ కానీ.. ఇక్కడ జాకీ మహా అల్లరి అమ్మాయి. అందుకే వరుణ్ ధావన్ డ్రెస్ ఛేంజ్ చేసుకుంటుంటే వీడియో తీసి నెట్ లో పెట్టేసింది. ఓ పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లేందుకు వరుణ్ ఇలా నా కారునే కార్వాన్ చేసేశాడు అంటూ కామెంట్ పెట్టిన జాక్వెలిన్.. తన కారును ఛేంజింగ్ రూమ్ చేశాడని చెప్పింది.

ఈ హీరో డ్రెస్ ఛేంజ్ చేసుకోవడం.. అందులోనూ కారులో మార్చుకోవడం.. పైగా మరో సెక్సీ హీరోయిన్ ఆ ఇన్సిడెంట్ ని వీడియో తీసేయడమే కాకుండా.. నెట్ లో పెట్టేస్తే.. ఆ వీడియో వైరల్ గా మారిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. మరో నాలుగు రోజుల్లో విడుదల కానున్న జుడ్వా2 మూవీలో.. తాప్సీ పన్ను కూడా మరో హీరోయిన్ గా నటించింది.