ఆ కొత్త యాంకరే మోస్ట్ డిజైరబుల్

Thu May 17 2018 17:07:43 GMT+0530 (IST)

టాలీవుడ్ లో ఈ మధ్య సినిమలతోనే కాకుండా కొందరు నటీమణులు సీరియల్స్ తో అలాగే రియాలిటీ షోలతో కూడా క్రేజ్ సంపాదించుకుంటారు. ముఖ్యంగా యాంకర్స్ గా చేసిన ముద్దుగుమ్మలు గ్లామర్ గా కనిపిస్తుండడంతో హీరోయిన్స్ లెవెల్లో ఫెమాస్ అవుతున్నారు. గత కొంత కాలంగా యాంకర్స్ లలో చాలా రకాలుగా మార్పులు వస్తున్నాయి. కేవలం మాటలతోనే కాకుండా వారి గ్లామర్ తో కూడా షోలకు రేటింగ్ తెస్తున్నారు.అనసూయ - రష్మి వంటి వారు ఏ రేంజ్ లో ఆదరగొడుతున్నారో అందరికి తెలిసిందే. వారికి సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి. అయితే వారికంటే ఎక్కువగా క్రేజ్ అందుకుంటున్న ముద్దుగుమ్మలు మరికొంత మంది ఉన్నారు. రీసెంట్ గా ఓ లీడింగ్ మీడియా హౌస్ నిర్వహించిన మోస్ట్ డిజరైబుల్ ఉమెన్ ఆన్ టివి 2017లో వర్షిని మొదటి ర్యాంక్ ను అందుకుంది. డి షో ద్వారా పాపులర్ అయిన ఈ యాంకర్ కి ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే పెరుగుతోంది.

మొదట చందమామ కథలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వర్షిని అప్పట్లో ఓ సినీ డైరెక్టర్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది క్యాన్సిల్ అవ్వడంతో టివి షోల ద్వారా తన టాలెంట్ నిరూపించుకుంటోంది. పోటీగా రేష్మి - అనసూయ లాంటి వారు ఉన్నప్పటికీ అమ్మడికి క్రేజ్ బాగానే అందుతోంది. ఇక పొవే పోరా షోతో విష్ణు ప్రియ రెండవ స్థానంలో ఉండగా మేఘన లోకేష్ (శశిరేఖ పరినయం సీరియల్) - కృతిక సింగ్ (ఓకే జాను సీరియల్) - రష్మి టాప్ 5 లో ఉండగా అనసుయ - శ్రీముఖి వరుసగా 6 - 7 స్థానాల్లో స్థిరపడ్డారు.