Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ఆరవ అర్జున్ రెడ్డి

By:  Tupaki Desk   |   23 Sep 2018 7:33 AM GMT
టీజర్ టాక్: ఆరవ అర్జున్ రెడ్డి
X
గత ఏడాది విడుదలైనా ఇంకా దాని తాలూకు హ్యాంగ్ ఓవర్ ఉండేంత రేంజ్ లో సక్సెస్ అయిన అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ వర్మ టీజర్ ఇవాళ విడుదల చేసారు. ధృవ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్నే వదిలారు. దానికి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రాలింగ్ జరుగుతోంది. కారణం ధృవ్ ఏ కోణంలోనూ విజయ్ దేవరకొండలో మెచో మ్యాన్ లక్షణాలకు దగ్గరలో లేకపోవడమే. సరే పోస్టర్ కాబట్టి దాని బట్టి జడ్జ్ చేయడం న్యాయం కాదు కాని ఈ రోజు వచ్చిన టీజర్ తో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఒరిజినల్ కు పెద్దగా మార్పులేవీ చేయకుండా మక్కికి మక్కి దించేశారు. కాకపోతే పనిమనిషి పాత్రకు కాస్త ప్రాధాన్యత ఇచ్చి అందులో కాలాలో రజని సరసన నటించిన ఈశ్వరి రావును పెట్టడం ఒక్కటే కాస్త చేంజ్ గా కనిపిస్తోంది. ఇంట్రో తో మొదలుకుని హీరో హీరోయిన్ల పరిచయం ముద్దు సీన్ మాదర్ డాష్ అంటూ బూతు తిట్టేసి బులెట్ మీద గొడవకు బయలుదేరడం అంతా ఇంచు కూడా మార్పు లేకుండా ఉంది. ధృవ్ లో క్యూట్ నెస్ ఉన్నప్పటికీ అర్జున్ రెడ్డి పాత్రకు కావాల్సిన డెప్త్ ఎమోషన్ అయితే కనిపించలేదు. పైగా కుర్రాడు కాస్త పొట్టిగా బొద్దుగా ఉండటం మరో మైనస్ అని చెప్పొచ్చు.

ఇందులో హీరోయిన్ గా మేఘా చౌదరి పరిచయమవుతోంది. లుక్స్ లో కాస్త అటు ఇటుగా షాలిని పాండేని తలపించింది. లిప్ టు లిప్ కిస్ విషయంలో పెద్దగా మొహమాటం పడకుండా ఇచ్చేసింది. బోల్డ్ సీన్స్ లో తెలుగు రూట్ లోనే వెళ్లిపోయారు. మొత్తానికి అర్జున్ రెడ్డి రీమేక్ గా వర్మ పేరుతో రూపొందిన ఈ రీమేక్ గురించి మనవాళ్ళు పెదవి విరుస్తున్నారనే చెప్పాలి. మరో ట్విస్ట్ ఏంటంటే దీన్ని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. వర్మ పేరుతోనే తెలుగు వెర్షన్ కూడా రాబోతోంది. అయినా అర్జున్ రెడ్డినే ఇప్పటికీ లెక్కలేనన్ని సార్లు చూసిన తెలుగు యూత్ మళ్ళి అదే పనిగా ప్రత్యేకంగా ఈ వర్మ చూడటం అనుమానమే. పోనీ ధృవ్ విజయ్ దేవరకొండను మరిపించేలా ఉంటే అది వేరే సంగతి. కానీ అలా లేకపోవడం వల్ల కామెంట్స్ కు అవకాశం ఇవ్వడం తప్ప ఉపయోగం లేదు. ధృవ్ ని లాంచ్ చేయడం కోసమే అయితే అది ఇంకో సినిమాతో చేస్తే బాగుండేది. అంతేతప్ప అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ బలంగా ముద్రించుకుపోయిన తరుణంలో మళ్ళి అదే కథలో చూపిస్తే తేడా కొట్టే ప్రమాదం ఉంది. ఏదైతేనేం ధృవ్ తమిళ్ లో ఏమో కానీ లుక్ టెస్ట్ లో మాత్రం తెలుగు వాళ్లకు ధృవ్ అత్తెసరు మార్కులతో పాస్ అయ్యాడు