Begin typing your search above and press return to search.

పబ్లిక్ రోడ్ మీద దర్శకుల ట్రిపుల్ రైడింగ్

By:  Tupaki Desk   |   20 July 2019 11:06 AM GMT
పబ్లిక్ రోడ్ మీద దర్శకుల ట్రిపుల్ రైడింగ్
X
రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమో లేదా భరించలేని ప్రహసనమో ఉంటుంది. అది తెరమీద ఎంత చూపించినా పర్వాలేదు. నచ్చితే జనం మెచ్చుకుంటారు లేదా ఎప్పటిలాగే తేడా కొట్టిందా వర్మ ఇంతేలే అని తూర్పు తిరిగి దండం పెట్టుకుంటారు. కానీ పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు మాత్రం వర్మ లాంటి సెలెబ్రిటీలు జాగ్రత్తగా ఉండాల్సిందే. తాజాగా తన శిష్యుడు సాధించిన సక్సెస్ పట్ల పూరి కన్నా ఎక్కువ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అవుతున్న వర్మ ఆ అత్యుత్సాహంలో చేస్తున్న పనులు తప్పుడు సంకేతం ఇచ్చేలా ఉన్నాయి.

తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో వర్మ ఓ ఫోటో పోస్ట్ చేశారు. ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి లక్ష్మీస్ ఎన్టీఆర్ కు దర్శకత్వ బాధ్యతలు పంచుకున్న అగస్త్య తాను ముగ్గురు కలిసి పబ్లిక్ రోడ్ మీద ట్రిపుల్ రైడింగ్ బైక్ మీద ఇస్మార్ట్ శంకర్ కోసం వెళ్తున్నామని పోస్ట్ చేశాడు. ఇప్పుడిది వైరల్ అవుతోంది. ఇది పబ్లిసిటీ కోసమా అంటే ఇస్మార్ట్ శంకర్ కు ఈ ముగ్గురికి ఏ విధంగానూ సంబంధం లేదు. ఇప్పుడు వర్మ లాంటి దర్శకుడే రూల్స్ పాటించనిది మాకెందుకు అని ఫ్యాన్స్ ఇన్స్ పైర్ అయితే ఇంకేముంది. ఫైన్లకు కోర్టులకు వర్మ భయపడే రకం కాదు కాబట్టి ఇలాంటివి ఎన్నైనా చేయొచ్చు.

కానీ అతన్ని ఫాలో అయ్యేవాళ్ళకు అది వర్తించదు కదా. అసలే హైదరాబాద్ పోలీస్ రూల్స్ విషయంలో ఈ మధ్య చాలా స్ట్రిక్ట్ గా ఉంటోంది. ఇప్పటికే కొందరు నెటిజెన్లు ఈ ఫోటోను ట్వీట్ చేస్తూ సిటీ పోలీస్ కు ట్యాగ్ చేసేశారు. మరి దీనికి డిపార్ట్ మెంట్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. వర్మ అంటే సరే కానీ వర్ధమాన దర్శకులైన శిష్యులు కూడా ఇలా గురువు పుణ్యమా అని వీటి ద్వారా వైరల్ అవుతున్నారు