Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డికి కత్తెర వేటు తప్పదట!!

By:  Tupaki Desk   |   21 Sep 2018 7:03 AM GMT
అర్జున్ రెడ్డికి కత్తెర వేటు తప్పదట!!
X
'అర్జున్ రెడ్డి' ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. కంటెంట్ వైజ్.. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వైజ్ మాత్రమే కాదు.. సినిమా డ్యూరేషన్ కూడా అరాచకమే. అర్జున్ రెడ్డి విడుదల కు ముందు రెండు గంటల నుండి రెండున్నర గంటలు మధ్యలోనే అన్నీ సినిమాలు. రెండున్నర అంటేనే బెదిరిపోయే పరిస్థితి ఉన్నటైం లో మూడు గంటల ఆరు నిముషాలు అనగానే అందరికీ గుండె గుభేలుమంది. కానీ సినిమా చూసి అందరూ ఆ నిడివి అవసరమేనని ఒప్పుకున్నారు అది వేరే విషయం. కానీ 'అర్జున్ రెడ్డి' రీమేకుల డ్యూరేషన్ ఎలా ఉంది?

ఈ సినిమా తమిళంలో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరోగా బాలా దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ 'వర్మ'. కొత్త హీరో దానికి తోడూ డెబ్యూ సినిమా కాబట్టి ల్యాగ్ అనిపించకుండా క్రిస్ప్ గా చేసే ప్రయత్నాలలో మేకర్స్ ఉన్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో 'వర్మ' సినిమా కు మూడు గంటల నిడివి మాత్రం ఉండదు. మరి రీమేక్ లో ఏ సీన్స్ కు కత్తెర వేటు పడుతుందో వేచి చూడాలి. ఇప్పటికి 'వర్మ' ఫైనల్ రన్ టైమ్ లాక్ చేయలేదు గానీ మరి పూర్తిగా కుదించి 2.30 గంటలతో సరిపెడతారా లేదంటే జస్ట్ మూడు గంటలకు ఓ పది నిముషాలు తక్కువగా సరిపెట్టుకుంటారో తెలీదు.

ఇక 'వర్మ' షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. సెప్టెంబర్ 23 న ఆడియో ను ధృవ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తున్నారట. ఈ సినిమాకు రాదన్ సంగీత దర్శకుడు. మేఘ చౌదరి ఈ సినిమాలో షాలిని పాండే పాత్ర పోషిస్తోంది.