Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: బుస కొడుతున్న నాగిని

By:  Tupaki Desk   |   25 Sep 2018 9:28 AM GMT
ఫోటో స్టోరీ: బుస కొడుతున్న నాగిని
X
వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ .. ఇటీవ‌లి కాలంలో అనూహ్యంగా పాపుల‌ర‌వుతున్న పేరు ఇది. కాస్టింగ్ కౌచ్ గురించి బ‌హిరంగంగా మాట్లాడిన డేరింగ్ గాళ్‌ గా పాపుల‌రైంది. హీరో విశాల్ చిన్న‌నాటి స్నేహితురాలిగా సుప‌రిచితం. వ‌రు- విశాల్ ప్రేమాయ‌ణంపైనా కోలీవుడ్‌లో ప్ర‌చార‌మైంది. అదంతా స‌రే.. విశాల్‌ తో అంత‌టి ర్యాపో ఉంది కాబ‌ట్టే ప్ర‌స్తుతం అత‌డు న‌టిస్తున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `పందెంకోడి 2`లో వ‌ర‌ల‌క్ష్మి విల‌న్‌ గా న‌టిస్తోంద‌న్న ప్ర‌చారం వేడెక్కించింది. త‌మిళ నిర్మాత‌ల సంఘం ఎన్నికల్లో వ‌ర‌ల‌క్ష్మి డాడ్‌, న‌టుడు శ‌రత్ కుమార్‌ పై హోరాహోరీగా పోటీ చేశాడు విశాల్. అందుకు క‌సి తీర్చుకుంటోందా? అంటూ వ‌రూపై కామెంట్లు వినిపించాయి. పందెంకోడి 2లో వ‌ర‌ల‌క్ష్మి లుక్ రిలీజైన‌ప్పుడు దానికి అభిమానుల నుంచి గొప్ప స్పంద‌న వ‌చ్చింది. వ‌రు `న‌ర‌సింహా`లో నీలాంబ‌రి రేంజు పాత్ర‌లో న‌టిస్తోందంటూ ప్ర‌చారం సాగింది.

పందెంకోడి 2`తో పాటు వ‌ర‌ల‌క్ష్మి వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తోంది న‌టిస్తోంది. అందులో నాగిని బ్యాక్‌ డ్రాప్ మూవీ `నియా` ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి ఓ నాగ‌క‌న్య‌ పాత్ర‌లో న‌టిస్తోంది. ముగ్గురు నాగక‌న్య‌ల ప్రేమ‌క‌థ‌తో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. వ‌ర‌ల‌క్ష్మితో పాటు - రాయ్ ల‌క్ష్మీ - కేథ‌రిన్ థ్రెసా నాగిని పాత్ర‌ల్లో మైమ‌రిపించ‌నున్నారు. ఇన్నాళ్లు నాగిని క‌థాంశం అంటే బుల్లితెర సిరీస్ `నాగిన్‌` గుర్తుకొస్తుంది. తెలుగులో నాగిని క‌థాంశాల్లో యమున‌ - ప్రేమ వంటి నాయిక‌లు న‌టించారు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి - మందాకిని బాలీవుడ్‌ లో నాగిని పాత్ర‌లో న‌టించి మెప్పించారు. అందుకే వ‌రు నాగిని పాత్ర‌లో న‌టిస్తోంది అన‌గానే ఆస‌క్తి రెయిజ్ అయ్యింది.

ఇదిగో ఈ ఫోటో అదే. నాగినిగా వ‌రు బుస కొడుతున్న ఫోజును ప్ర‌స్తుతం అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. నియా చిత్రానికి ఎల్‌.సురేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. జై, బాల శ‌ర‌వ‌ణ‌న్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రంలో జై- నాగిని(ముగ్గురు భామ‌లు) ల‌వ్ నేప‌థ్యం ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకోనుంద‌ని తెలుస్తోంది. `పందెంకోడి 2` - `నియా` చిత్రాల‌తో వ‌ర‌ల‌క్ష్మి ఇమేజ్ టాలీవుడ్‌ లోనూ పెరుగుతుందేమో చూడాలి.