Begin typing your search above and press return to search.

పాజిటివ్‌ టైటిల్‌: సంతోషం సగం బలం

By:  Tupaki Desk   |   28 July 2015 4:19 AM GMT
పాజిటివ్‌ టైటిల్‌: సంతోషం సగం బలం
X
వెంకీతో నయన్‌ జోడీ కడుతోంది... అనగానే మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని ఠకీమని చెప్పేస్తాం. అది నిజమేనని లక్ష్మి, తులసి లాంటి విజయవంతమైన సినిమాలు నిరూపించాయి. అందుకే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ జోడీని మరోసారి తెరపై చూసే భాగ్యం తెలుగు ప్రేక్షకులకు కలగనుందని ఇదివరకే చెప్పుకున్నాం. ఈ హ్యాట్రిక్‌ సినిమాకి 'సంతోషం సగం బలం' అనే టైటిల్‌ ని ఫిక్స్‌ చేశారనేది తాజా అప్‌ డేట్‌. వచ్చే నెలలోనే షూటింగు మొదలెడుతున్నారు.

టైటిల్‌ చాలా బావుంది. సాఫ్ట్‌ గా క్యాచీగా ఉంది. పైగా పాజిటివ్‌ అప్పీల్‌ ఉన్న టైటిల్‌ ఇది. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి క్లాసిక్‌ సినిమాల్ని తెరకెక్కించిన క్రాంతి మాధవ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అతడు ఎంచుకునే టైటిల్స్‌ అన్నీ ఎంచుకునే కథాంశాల్లానే పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ ని కలగజేస్తాయి. సంతోషం సగం బలం.. ఈ టైటిలే ఓ పాజిటివ్‌ ఎనర్జీ కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్‌ ఎలాంటి జంకూ గొంకూ లేకుండా థియేటర్ల వరకూ వచ్చేస్తారు. పైగా వెంకీకి ఉన్న ఇమేజ్‌ దృష్ట్యా మహిళా ప్రేక్షకుల్ని టార్గెట్‌ చేస్తూ ఈ టైటిల్‌ పెట్టారనిపిస్తోంది. గోపాల గోపాల, దృశ్యం చిత్రాల తర్వాత మళ్లీ వెంకీని ఓ మ్యాజికల్‌ క్యారెక్టర్‌ లో చూడాలని ఆశపడుతున్న అభిమానులకు ఇది తాయిలం లాంటి టైటిల్‌ సుమీ!