Begin typing your search above and press return to search.

వంశీ ఇప్పుడు ఎవరితో చేస్తాడబ్బా!!

By:  Tupaki Desk   |   26 July 2016 5:16 AM GMT
వంశీ ఇప్పుడు ఎవరితో చేస్తాడబ్బా!!
X
దర్శకుడు వంశీ పైడిపల్లికి స్టైలిష్ మేకింగ్ లో మంచి పేరే ఉంది. కెరీర్ లో హిట్ లెక్కలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ బృందావనం నుంచి అన్నీ మంచిగా ఫేర్ చేసే సినిమాలనే తీస్తున్నాడు. రామ్ చరణ్ ఎవడు.. నాగ్-కార్తిల ఊపిరి కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే వసూళ్లు సాధించాయి. ఊపిరి విషయంలో అయితే అందరి ప్రశంసలు కూడా అందుకున్నాడు.

మరి వంశీ పైడిపల్లి చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? ఊపిరి సక్సెస్ తర్వాత అఖిల్ రెండో మూవీ డైరెక్టర్ గా ఆఫర్ ఇచ్చాడు నాగార్జున. కానీ.. యే జవానీ హై దివానీ ని రీమేక్ చేయాల్సిందిగా చెప్పడంతో.. వంశీ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత మహేష్ కి ఓ స్టోరీ చెప్పి ఒప్పించాడనే టాక్ వినిపించింది. అయితే.. వచ్చే నెలలో మురుగదాస్ తో ద్వి భాషా చిత్రాన్ని మొదలుపెట్టనున్న మహేష్ బాబు.. డిసెంబర్ నుంచి కొరటాల శివతో కొత్త సినిమా చేసేందుకు ఓకే చేసేశాడని లేటెస్ట్ టాక్.

ఇటు అఖిల్ కూడా రెండు కొత్త ప్రాజెక్టులను ఓకే చేశాడని అంటున్నారు. అటు మహేష్.. ఇటు అఖిల్ బిజి అయిపోవడంతో.. ఇప్పుడు వంశీ ఎవరితో సినిమా చేస్తాడన్నది క్వశ్చన్ గా మిగిలిపోయింది.