ప్రీ టీజర్: వామ్మో..వరుణ్ తేజ్..నువ్వేనా ఇది!

Mon Jun 24 2019 18:59:20 GMT+0530 (IST)

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'వాల్మీకి' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  తమిళ సూపర్ హిట్ 'జిగార్తాండ' కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళంలో బాబీ సింహా పోషించిన నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్ ను ఈ రీమేక్ లో వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ ను విడుదల చేశారు.హరీష్ శంకర్ ముందుగా చెప్పినట్టే డైలాగ్స్ లేకుండా జస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడిన ప్రీ టీజర్ ఇది.  జస్ట్ 18 సెకన్లే ఉంది. వరుణ్ తేజ్ తన రగ్డ్ లుక్ తో భారీ షాక్ ఇచ్చాడు.  పొడవాటి గడ్డం.. పొడవు జుట్టు... మెడలో పులిగోరు దండ.. తులసిమాల లాంటి మరో రెండు దండలు.. చేతికి కడియం.. నలుపు రంగు జుబ్బా తో మహా మోటుగా యమా నాటుగా ఉన్నాడు.  వరుణ్ తేజ్ ఇప్పటివరకూ తన గెటప్స్ లో చూపించిన మేకోవర్ వేరు.. ఇది వేరు. నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ గెటప్ లో స్మోక్ చేయడం చూస్తుంటే పర్ఫెక్ట్ యాంటి హీరోలా కనిపిస్తున్నాడు.  ఇక పిస్టల్ ను తన కణత దగ్గర పెట్టుకొని.. ఆలోచిస్తున్నట్టుగా కళ్ళు తెరిచే ఎక్స్ ప్రెషన్ ఇంటెన్స్ గా ఉంది. మిక్కీ జె. మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సూట్ అయింది.

ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఇంత ఇంటెన్స్ గా ప్రీ టీజర్ కట్ చేయడం.. వరుణ్ ను సూపర్ రగ్డ్ గా చూపించడంలో దర్శకుడు హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు.  'దబాంగ్' సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ కు తగ్గటు మలిచి అందరిని మెప్పించిన ట్రాక్ రికార్డు హరీష్ ది.   ఈ సారి కూడా ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నాడనే నమ్మకాన్ని ఈ ప్రీ టీజర్ తో కలిగించాడు. ఆలస్యం ఎందుకు.. మాటల్లేకుండా చూసేయండి!