Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్స్ కి ఛాలెంజింగ్ టార్గెట్

By:  Tupaki Desk   |   16 Sep 2019 8:47 AM GMT
మెగా ప్రిన్స్ కి ఛాలెంజింగ్ టార్గెట్
X
వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం వాల్మీకి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 14 రీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈనెల 20న సినిమా రిలీజ‌వుతోంది. వెంకీ అతిధిగా ప్రీరిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా 20వ తేదీన య‌థాత‌థంగా రిలీజ‌వుతుందా అంటే.. ఇప్ప‌టికీ కోర్టు వివాదాలు వేడెక్కిస్తూనే ఉన్నాయి. వాల్మీకి బోయ‌లు కోర్టుల ప‌రిధిలో పోరాడుతూ టైటిల్ మార్చే వ‌ర‌కూ రిలీజ్ ఆపాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే చిత్ర‌యూనిట్ మాత్రం టైటిల్ మార్పు ప్ర‌స్థావ‌న అన్న‌దే లేకుండా.. ఇది వాల్మీకి గొప్ప‌త‌నంపై సినిమా తీశామ‌ని క‌వ‌ర్ చేస్తున్నారు. రిలీజ్ డైల‌మాతో ప‌ని లేకుండానే ప్ర‌చారం సాగుతోంది.

వివాదం ర‌న్ అవుతుండ‌గానే.. `వాల్మీకి `రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా వాల్మీకి ప్రీరిలీజ్ బిజినెస్ గురించిన‌ ఆస‌క్తిక‌ర సంగ‌తులు తెలిశాయి. ఈ సినిమా ఓవ‌రాల్ గా 24.25 కోట్ల మేర ప్ర‌పంచ‌వ్యాప్త బిజినెస్ చేసింది. నైజాం-7.4కోట్లు.. సీడెడ్-3.35కోట్లు.. ఆంధ్రా-9 కోట్లు మేర బిజినెస్ పూర్త‌యింది. ఏపీ తెలంగాణ క‌లుపుకుని 19.75 కోట్ల బిజినెస్ సాగింది. క‌ర్నాట‌క ఇత‌ర భార‌త‌దేశం క‌లుపుకుని 1.50 కోట్ల మేర బిజినెస్ చేశారు. అమెరికా 2.2 కోట్ల మేర బిజినెస్ పూర్త‌యింది. ఇత‌ర ప్ర‌పంచం నుంచి 80ల‌క్ష‌ల బిజినెస్ చేసింది.

25 కోట్ల మేర బిజినెస్ అంటే అదేమీ చిన్న టార్గెట్ కాదు. ఆరంభం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ వ‌స్తేనే వ‌సూళ్ల ప‌రంగా డోఖా ఉండ‌దు. తొలిరోజు స‌మీక్ష‌లు.. మౌత్ టాక్ బావుంటేనే జెట్ స్పీడ్ తో క‌లెక్ష‌న్స్ సాధ్య‌మ‌వుతున్న రోజులివి. తొలి వీకెండ్ నాటికే 15-20 కోట్ల రిట‌ర్న్స్ రావాల్సి ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కూ వాల్మీకి కి ప్ర‌చారం చూస్తే.. బిగ్ రేంజులో లేదు. ఇప్ప‌టికీ నానీస్ గ్యాంగ్ లీడ‌ర్ క‌లెక్ష‌న్ల ప‌రంగా బ‌లంగా ఉంది. ఫ్యామిలీ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తోంది. అయితే వాల్మీకి కి అంతే మంచి టాక్ వ‌స్తేనే నిల‌దొక్కుకోగ‌లుగుతుంది. పైగా ఇంత పెద్ద టార్గెట్ ని అందుకోవాలంటే అంత సులువేమీ కాదు. ప్ర‌చారం ప‌రంగానూ ఈ నాలుగు రోజుల్లో ఎంత స్పీడ్ చూపిస్తారు అన్న‌ది చూడాలి.