Begin typing your search above and press return to search.

వంశీకి ఎన్టీఆర్‌ జెండా ఊపేశాడట

By:  Tupaki Desk   |   10 Oct 2015 7:30 AM GMT
వంశీకి ఎన్టీఆర్‌ జెండా ఊపేశాడట
X
టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా పేరు సంపాదించుకున్న వక్కంతం వంశీ.. డైరెక్టర్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. ఈయనతో మూవీ తీసేందుకు జూనియర్ ఎన్టీఆర్ గతంలోనే ఓకే చెప్పేశాడు. స్టోరీ కూడా ఎప్పుడో ఫైనల్ చేసేసినట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ఫుల్ స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసుకున్నాడు వంశీ. అయితే.. ఎన్టీఆర్ కమిట్ మెంట్స్ కారణంగా ఇప్పటివరకూ ఈ మూవీ ప్రారంభానికి నోచుకోలేదు. ఇన్నాళ్లకు ఈ ముహూర్తం సెట్ అయినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో చేస్తున్నాడు ఎన్టీఆర్. దీని తర్వాత కొరటాల శివతో మూవీ కన్ ఫాం అయింది. దీని తర్వాత ఎన్టీఆర్ చేయబోయే మూవీ వక్కంతంతోనే అని తెలుస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందిట. మూవీకి సంబంధించిన డీటైల్స్ 2016 ఫిబ్రవరి తర్వాత అనౌన్స్ చేస్తారని టాక్. అయితే.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే ఈ చిత్రం సెట్స్ కి వెళ్లే అవకాశముంది. ఫ్యామిలీ కం మాస్ ఎంటర్టెయినర్ గా ఈ స్టోరీ రెడీ చేసుకున్నాడట వక్కంతం వంశీ.

ఈ విషయాన్ని వంశీ సన్నిహితులు చెబుతున్నా.. అసలు విషయాన్ని చెప్పేందుకు వంశీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాస్టింగ్ - టెక్నికల్ టీంని ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడాయన. ఎన్టీఆర్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో రానున్న మూవికి అబ్బూరి రవి డైలాగ్స్ అందించబోతున్నాడు.