Begin typing your search above and press return to search.

పాపం వక్కంతం.. ఇద్దరూ పక్కనేశారే

By:  Tupaki Desk   |   27 Sep 2016 7:30 PM GMT
పాపం వక్కంతం.. ఇద్దరూ పక్కనేశారే
X
టాలీవుడ్ లో రైటర్లు.. డైరెక్టర్లుగా కల్చర్ చాలా స్పీడ్ గా నడుస్తోంది. స్టోరీ రాయడంలోనే కాదు.. దాన్ని పిక్చరైజ్ చేయడంలో కూడా బోలెడంత ట్యాలెంట్ చూపించేస్తున్నారు. అంతే కాదు.. టాప్ డెైరెక్టర్లుగా ఎదుగుతుండడం.. మిగిలినవాళ్లను కూడా ఆ రూట్ లో ప్రయత్నించేటట్లుగా చేస్తోంది. త్రివిక్రమ్ నుంచి మొదలైన ఈ కల్చర్.. కొరటాలతో పీక్ స్టేజ్ కి చేరిపోయిందని చెప్పాలి. రీసెంట్ గా బాగా ఫేమ్ సంపాదించుకున్న అనిల్ రావిపూడి కూడా ఈకోవలోని వాడే.

ఇలాగే దర్శకుడిగా మారాలనే ఉత్సాహాన్ని చాలా ఏళ్లుగా ప్రదర్శిస్తున్నాడు వక్కంతం వంశీ. టెంపర్ తర్వాత ఈయన పేరు మార్మోగిపోయింది. అప్పటి నుంచి దర్శకుడిగా మారేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు కూడా. ఎలాగైతేనేం ఎన్టీఆర్ ని తన సినిమాకి ఒప్పించగలిగిన వక్కంతం.. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో అఫీషియల్ గానే చెప్పేశాడు. కానీ.. దాని సక్సెస్ రేంజ్ తర్వాత వక్కంతం వంశీకి ఇచ్చిన మాటను.. ఎన్టీఆర్ వెనక్కు తీసేసుకున్నాడు. ప్రాజెక్టు ఫైనల్ కాలేదని తేల్చేశాడు.

ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ నుంచి కోలుకుని.. అల్లు అర్జున్ కలిసి స్టోరీ చెప్పి ఒప్పించాడు వక్కంతం వంశీ. ఇక్కడా సేమ్ సీన్. స్టోరీ నచ్చేసిందడనం.. మొదలుపెట్టేద్దామని అనడంతో.. నెక్ట్స్ జనవరి నుంచి బన్నీ తాను మొదలుపెట్టేస్తున్నామని.. తన సన్నిహితుల దగ్గర బన్నీ సంగతి చెప్పుకున్నాడట వక్కంతం. కానీ లింగుస్వామితో ప్రాజెక్టుని బన్నీ అనౌన్స్ చేసేయడంతో.. వక్కంతం వంశీని బన్నీ కూడా పక్కన పెట్టేసినట్లయింది. మరి కొన్ని నెలలు ఎదురు చూడ్డం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది ఈ రైటర్ కం ఔత్సాహిక డైరెక్టర్ కి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/