Begin typing your search above and press return to search.

మూణ్నెల్ల ముందే గిఫ్ట్ ప్లాన్ చేశాడు

By:  Tupaki Desk   |   21 Feb 2017 5:17 AM GMT
మూణ్నెల్ల ముందే గిఫ్ట్ ప్లాన్ చేశాడు
X
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే-దువ్వాడ జగన్నాధం ఫస్ట్ లుక్.. ఆన్ లైన్ ఏ రేంజ్ లో ట్రెండింగ్ అయిపోయిందో చూశాం. ముందు నుంచి ఎక్స్ పెక్ట్ చేసినదే అయినా.. పక్కా బ్రాహ్మిన్ రోల్ లో బన్నీ ఇమిడిపోయిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సరైనోడు తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకుని డీజే మూవీని ప్రారంభించిన బన్నీ.. ఈ సారి మాత్రం జోరు మీదున్నాడు.

డీజే రిలీజ్ కంటే ముందే.. కొత్త సినిమా అనౌన్స్ మెంటే కాదు.. ప్రారంభించేస్తాడట కూడా. రైటర్ వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ పై ఈ చిత్రం తెరకెక్కనుండగా.. ఈ మూవీని ఏప్రిల్ 8న ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.. సరిగ్గా స్టైలిష్ స్టార్ బర్త్ డే రోజునే కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం పెట్టేశాడట బన్నీ.

ఇంకా మూడు నెలలు ఉండగానే.. అభిమానులకు గిఫ్ట్ ప్లాన్ చేసేశాడు బన్నీ. ఈ ప్రాజెక్టుపై అనౌన్స్ మెంట్ తో పాటు.. మిగిలిన డీటైల్స్ ను త్వరలోనే నిర్మాత లగడపాటి శ్రీధర్ తెలియచేయనున్నారు. దీంతో పాటు తమిళ డైరెక్టర్ లింగుస్వామి.. బన్నీతో ఓ బై తెలుగు- తమిళ్ లింగ్యువల్ తీయాల్సి ఉంది. వక్కంతం వంశీ-లింగుస్వామి ప్రాజెక్టులను ఒకే సారి హ్యాండిల్ చేయనున్నాడట స్టైలిష్ స్టార్.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/