Begin typing your search above and press return to search.

మెగాఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రీ...!

By:  Tupaki Desk   |   27 Nov 2015 11:11 AM GMT
మెగాఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రీ...!
X
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటికీ చాలా మంది హీరోలొచ్చేశారు. ఓ ర‌కంగా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ హీరోలు న‌టించిన సినిమాల‌కు ప్ర‌తి సంవ‌త్స‌రం కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చి ప‌డుతున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి చిరు, నాగ‌బాబు త‌ర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మెగావపర్ స్టార్ రాంచరణ్ తేజ్‌ - డాన్సింగ్ స్టార్ సాయిధరమ్ తేజ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ - అల్లు శిరీష్ వ‌చ్చారు. ఇక రీసెంట్‌గా అదే ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ లిస్టు ఇలా ఉంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రీకి రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ట‌. చిరు హీరోగా ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శంక‌ర్‌దాదా జిందాబాంద్ సినిమాలో ఛైర్‌ లో అచేత‌నంగా ఓ పిల్లాడు కూర్చుని ఉంటాడు గుర్తుందా...అత‌డే మెగాస్టార్ మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్‌. సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడైన వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌స్తుతం త‌న స్ట‌డీ కంటిన్యూ చేస్తూనే యాక్టింగ్‌ - డ్యాన్స్‌ - ఫైట్స్‌ లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు. వైష్ణ‌వ్‌ తో సినిమా చేసేందుకు చాలా మంది ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రెఢీగా ఉన్నార‌ట‌.

చిరు ఓకే అంటే చాలు వైష్ణ‌వ్ వెండితెర ఎంట్రీ ఖాయ‌మైన‌ట్టే. అయితే వైష్ణ‌వ్ తేజ్ మాత్రం ప్ర‌స్తుతం త‌న దృష్టంతా స్ట‌డీపైనే ఉంద‌ని...న‌ట‌న‌లో పూర్తి స్థాయిలో శిక్ష‌ణ తీసుకున్నాకే తాను సినిమాల్లోకి వ‌స్తానంటున్నాడ‌ట‌. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది అన్న సాయి పిల్లా నువ్వులేని జీవితం - సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ సినిమాల‌తో ఒక్క‌సారిగా టాలీవుడ్‌ లో స్టార్ ఆఫ్ ఎట్రాక్ష‌న్ అయ్యాడు. మ‌రి త‌మ్ముడు వైష్ణ‌వ్ అన్న‌కు పోటీ ఇస్తాడా లేదా అన్న‌ది తెలియాలంటే వైష్ణ‌వ్ ఎంట్రీ వ‌ర‌కు ఆగాల్సిందే. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ తేజ్‌ ల‌లో రాంచ‌ర‌ణ్‌ తేజ్‌ - వ‌రుణ్‌ తేజ్‌ - సాయిధ‌ర‌మ్ తేజ్ ఉన్నారు. ఇప్పుడు వీరికి తోడుగా మ‌రో వైష్ణ‌వ్ తేజ్ వ‌చ్చి జాయిన్ అవుతున్నాడు.