Begin typing your search above and press return to search.

ఛ.. సల్మాన్ కొరియోగ్రాఫర్ ఏంటి!!!

By:  Tupaki Desk   |   24 Jan 2017 12:30 AM GMT
ఛ.. సల్మాన్ కొరియోగ్రాఫర్ ఏంటి!!!
X
మొన్నామధ్యన రిలీజైన సుల్తాన్ సినిమాలో సల్మాన్‌ ఖాన్ ఒక స్టెప్పేశాడు. నేల మీద కూర్చుని రౌండుగా దేకుతున్నట్లు ఉండే ఆ స్టెప్పును 'జగ్ గూమియా' పాటను విన్నెంటనే మీరు గుర్తుపట్టేస్తారులే. విశేషం ఏంటంటే ఆ స్టెప్ మనోడే కంపోజ్ చేశాడు. ఆ గొప్ప స్టెప్పుతో ఇప్పుడు మనోడ్ని కొరియోగ్రాఫర్ అనేస్తే.. మరి నిజమైన కొరియోగ్రాఫర్ల ఫీలింగ్ ఎలా ఉంటుంది? చిరాకు కమ్మెత్తుకొస్తుంది. డౌటుంటే ఇది వినుకోండి.

నిజంగానే జగ్ గూమియా సాంగును కొరియోగ్రాఫ్‌ చేసినందుకు.. 'ఉత్తమ కొరియోగ్రాఫి' క్యాటగిరీలో సల్మాన్‌ ఖాన్ ను నామినేట్ చేసింది 'ఫిలింఫేర్' మ్యాగజైన్. మొన్నజరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఈ క్యాటగిరీలోని నామినేషన్లు చూపించినప్పుడు.. సల్మాన్ పేరు కనిపించగానే.. ఆ ఫంక్షన్ నుండి లేచి వెళ్ళిపోయిందట కొరియోగ్రాఫ్‌ వైభవి మర్చంట్. ఈ మధ్య కాలంలో ఈమె 'నషా సే ఛడ్ గయ్ రే' (బేఫికర్).. హమ్మా హమ్మా (ఓకె జాను) వంటి ఎన్నో హిట్ నంబర్లకు మాంచి సిగ్నేచర్ మార్క్ ఉన్న స్టెప్పులు కంపోజ్ చేసిందిలే. ''సల్మాన్ ను బెస్ట్ కొరియోగ్రాఫర్ క్రింద నామినేట్ చేశారుగా.. మరి నేను కూడా అప్పుడప్పుడూ సినిమాల్లో కనిపిస్తున్నా.. నన్ను కూడా సుల్తాన్ పక్కనే బెస్ట్ యాక్టర్ పొజిషన్ కు నామినేట్ చేస్తారా??'' అంటూ ఈమె సోషల్ నెట్వర్క్ లో కూడా పోస్ట్ చేసేసింది.

సల్మాన్ ఖాను కు దాసోహం అనే బాలీవుడ్ జనాలు వైభవి మర్చంట్ ను పెద్దగా పట్టించుకోలేదు కాని.. మరి కోతి స్టెప్పులా ఉన్న ఆ ఫీటుకే సల్మాన్ ను అలా ఎలా నామినేట్ చేశారంటూ నెటిజన్లు మాత్రం అతడిని ఫిలిం ఫేర్ ను కలిపి ఏకేస్తూ.. వైభవికి సపోర్టుగా నిలుస్తున్నారు. కాని ఉపయోగం ఏముంటుందిలే. ఇకపోతే ఈ అవార్డుల్లో 'కపూర్ అండ్ సన్స్'లోని లడ్కీ బ్యూటిఫుల్ సాంగును కొరియోగ్రాఫ్‌ చేసినందుకు ఆదిల్ షేక్ కు అవార్డు లభించింది.