Begin typing your search above and press return to search.

కోలీవుడ్ లో పలు వెబ్ సైట్స్ బ్యాన్

By:  Tupaki Desk   |   23 Oct 2018 11:24 AM GMT
కోలీవుడ్ లో పలు వెబ్ సైట్స్ బ్యాన్
X
కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న సినిమాలు మొదటి రోజే పైరసీ బారిన పడుతుండటం నిర్మాతలను తీవ్రంగా కలచి వేస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏదో ఒక మార్గంలో పైరసీ అవుతూనే ఉంది. తాజాగా తమిళం లో విడుదలైన రెండు భారీ సినిమాలు విడుదలైన మొదటి రోజే పైరసీ అయ్యాయి.

విశాల్ హీరో గా నటించిన సండకొలి 2 మరియు ధనుష్ నటించిన వడ చెన్నయ్ చిత్రాల పైరసీ లింక్ లను కలిగి ఉన్న కొన్ని వెబ్ సైట్ లను కోలీవుడ్ నిర్మాతల మండలి కి చెందిన యాంటీ పైరసీ సెల్ కనిపెట్టిందట. వెంటనే ఆ సైట్ లను బ్యాన్ చేయడం తో పాటి వాటిని తొలగించేలా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

ఎంత చేసినా, ఎం చేసినా కూడా కోలీవుడ్ తో పాటు అన్ని సినిమా పరిశ్రమలో కూడా పైరసీ అనేది పెద్ద ప్రమాదంగా మారింది. దీనిని అరికట్టడం ఎవరి తరం కావడం లేదు. ఎప్పుడైతే ప్రేక్షకులు పైరసీ చూడకుండా ఉంటారో అప్పుడే వారి ఆట కట్టడం జరుగుతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పుడు సైట్లు బ్యాన్ చేసినా కూడా మళ్లీ వేరే డొమైన్ తో మళ్ళీ పైరసీ రాయుళ్లు రెచ్చిపోతూనే ఉంటారు.