Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హీటు పెంచుతున్న హాటు పోజులు

By:  Tupaki Desk   |   17 Oct 2018 7:17 AM GMT
ఫోటో స్టొరీ: హీటు పెంచుతున్న హాటు పోజులు
X
ముంబై బ్యూటీ వాణి కపూర్ నాని సినిమా 'ఆహ కళ్యాణం' తో తన లక్కును సౌత్ లో టెస్ట్ చేసుకున్నా పెద్దగా ఫలితం దక్కలేదు. దీంతో బాలీవుడ్ పైనే ఫోకస్ చేసి 'శుద్ద్ దేశి రొమాన్స్'.. 'బేఫిక్రే' లాంటి సినిమాలలో తన సత్తా చాటింది. 'బేఫిక్రే' బాక్స్ ఆఫీస్ వాద్ద విజయం సాధించలేదుగానీ వాణి బోల్డ్ అవతారం అందులోనే అందరికీ తెలిసింది. లెక్కకుమించి లిప్పు లాకులతో రణవీర్ సింగు కే పిచ్చెక్కించింది. 'ఉడే దిల్ బేఫిక్రే.. ' సాంగ్ లో ఒక సీన్లో అమ్మాయికి కూడా ముద్దిస్తుంది.. ఆఫ్ కోర్స్ అది కవర్ చేసి చూపిస్తారనుకోండి అది వేరే విషయం. కానీ ఇంత చేసినా బాలీవుడ్ లో బ్రేక్ అయితే రాలేదు.

అలా అని ఊరుకునే టైపు కాదు ఈ బ్యూటీ. ఫిట్నెస్ అంటే ప్రాణం కావడంతో రెగ్యులర్ గా జిమ్ముకెళ్ళి కసరత్తులు చేస్తూ కనీసం ఒక మిల్లి గ్రాము ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా బాడీలో చేరకుండా జాగ్రత్త పడుతుంది. దాంతోపాటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. సోమవారం అంటే చాలు చాలామంది సో...మ.. వా...ర..మా అంటూ నిట్టూరుస్తారు. కానీ ఈ బ్యూటీ వ్యాయామశాలలో సోమవారం ఎక్సర్ సైజులుచేయడమే కాకుండా ఆ ఫోటోలను.. తన హాట్ అవతారాన్ని ఇన్స్టాగ్రామ్ లో మంగళవారం షేర్ చేసింది. ఆ ఫోటోలకు బుధవారం కల్లా లక్షా యాభై వేల లైకులొచ్చాయి. అంటే కుర్రాళ్ళ హృదయ వీణను వాణి సుతిమెత్తగా మీటిందనేగా దానర్థం!

అన్నట్టు ఈ బ్యూటీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించే ఒక క్రేజీ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కిందట. హీరోలు ఎవరనుకున్నారు? హృతిక్ రోషన్.. టైగర్ ష్రాఫ్ లు. మరి ఈ సినిమా హిట్ అయితే అమ్మడి సుడి తిరుగుతుందేమో వేచి చూడాలి.