వినాయక్-బాలయ్య సినిమా టైటిల్ ఇదే

Wed Jun 13 2018 13:15:06 GMT+0530 (IST)


రాయలసీమ ఫ్యాక్షన్ యాక్షన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే హీరో మన బాలకృష్ణ అయితే డైరెక్టర్ వివి వినాయక్. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెన్నకేశవ రెడ్డి సినిమా తో మనం ఇప్పటికే చూసేశాం. ఎప్పుడో 2002 లో విడుదలైన ఆ సినిమా ఒక రేంజిలో హిట్ అయ్యి బడ్జెట్ కి ఆరింతలు కలెక్షన్లు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఆ కాంబో రిపీట్ అయితే?నటుడిగానే కాక ముఖ్యమంత్రి గా కూడా పని చేసి మన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఇప్పుడు ఆయన తనయుడు బాలయ్య బయోపిక్ గా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా బాలయ్య వివి వినాయక్ కథను ఒప్పుకోవడం మనకు తెలిసిన విషయమే. ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా ఈ సినిమాకు ఒక కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 'ఏ కె 47' పేరుతో ఈ యాక్షన్ సినిమా మన ముందుకు రాబోతోందని టాక్.

సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ కథ రాయలసీమ బాక్ డ్రాప్ లో సాగుతుంది. ప్రస్తుతం వివి వినాయక్ సినిమా స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.