Begin typing your search above and press return to search.

వినాయక్ కు వర్క్ అవుట్ అవుతుందా ?

By:  Tupaki Desk   |   15 July 2019 8:22 AM GMT
వినాయక్ కు వర్క్ అవుట్ అవుతుందా ?
X
దర్శకులు హీరో కావడం అనేది కొత్తేమి కాదు. దాసరి లాంటి వాళ్ళు ఎందరో తమదైన ముద్రవేశారు. హీరోలు దర్శకులైన ఉదాహరణలు చాలా ఉన్నాయి కానీ దర్శకులు హీరో అవతారం ఎత్తడం మాత్రం ఎప్పుడూ చూసేది కాదు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే డైరెక్టర్ గా డిమాండ్ పీక్స్ లో ఉన్నప్పుడే ఎస్వి కృష్ణారెడ్డి హీరోగా ఉగాది-అభిషేకం సినిమాలు చేశారు. కానీ వాటి ఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో ఆ ప్రయత్నాలు మానుకున్నారు. ఆ తర్వాత అలా ఎవరూ ప్రయత్నించిన దాఖలాలు పెద్దగా లేవు.

ఇప్పుడు వివి వినాయక్ వంతు వచ్చింది. గత కొంత కాలంగా తన మార్కు మేజిక్ మిస్ అవుతూ డిజాస్టర్లు అందుకుంటున్న వినాయక్ కు సాయి తేజ్ తో చేసిన ఇంటెలిజెంట్ ఫలితం తీవ్ర విమర్శలు ఎదురుకుంది. ఇప్పుడేమో హీరోనో లేక ప్రధాన పాత్రనో మొత్తానికి తన నటన మీద నడిచే సినిమాను వినాయక్ ఒప్పుకున్నాడు. అంతే కాదు జిమ్ లో చేరి విపరీతమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. శరీరంలో మార్పు మొహంలో తేడా కనిపిస్తోంది.

బొద్దుగా నిండు కుండలా ఉండే వినాయక్ ని ఇలా మారిపోవడం చూసి ఫాన్స్ ఆశ్చర్యపోతున్నారు. శరభ ఫేమ్ నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. వినాయక్ పడుతున్న కష్టం చూస్తుంటే సబ్జెక్టు చాలా డిమాండ్ చేసినట్టు ఉంది. ఓ పదేళ్ల క్రితం చేసుంటే ఎలా ఉండేదో కానీ మరీ లేట్ ఏజ్ లో హీరోగా మారుతున్న వినాయక్ ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి. నిర్మాత దిల్ రాజు అంటున్నారు కానీ ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.