Begin typing your search above and press return to search.

ఆ కాపీ సినిమా హరీష్ శంకర్ దట

By:  Tupaki Desk   |   20 April 2017 1:42 PM GMT
ఆ కాపీ సినిమా హరీష్ శంకర్ దట
X
ఓ పదేళ్ల క్రితం.. అంటే 2007లో సిద్ధార్ధ్ హీరోగా ఆట అనే సినిమా వచ్చింది. వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని.. థియేటర్లలోకి వచ్చిన సాయంత్రానికే కాపీ అని తేల్చేశారు జనాలు. పవన్ కళ్యాణ్ మూవీ గుడుంబా శంకర్ ను అటూ ఇటూ చేసి తీశారన్నది అప్పటి వివాదం.

మొత్తానికి ఇది మెల్లగా సమసిపోయింది కానీ.. అసలీ మూవీ తాను చేయాల్సినది కాదంటున్నాడు దర్శకుడు వీఎన్ ఆదిత్య. నిర్మాత ఎంఎస్ రాజు ఓ రోజు సడెన్ గా పిలిచి.. మనం ఆట మూవీ చేస్తున్నాం అన్నారట. కానీ ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తో తీస్తారనే విషయం తనకు తెలుసన్న ఆదిత్య.. నిర్మాత-దర్శకుడి మధ్య విబేధాల కారణంగానే ఆగిందన్నాడు. అప్పటికే వీఎన్ ఆదిత్య నాగార్జునతో బాస్ మూవీ చేస్తుండగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉందట.

కానీ తనను మనసంతా నువ్వే మూవీతో దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చిన నిర్మాత ఎంఎస్ రాజు కావడంతో.. మారు మాట్లాడకుండా ఆట మూవీ చేశాడట వీఎన్ ఆదిత్య. అయితే.. హరీష్ శంకర్ సిద్ధం చేసిన స్క్రిప్ట్ కాకుండా.. మొత్తం అంతా తిరిగి రాసుకున్నానని చెప్పాడు ఈ దర్శకుడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/