విజయ్ సేతుపతి మరోసారి..!

Fri Oct 19 2018 15:44:45 GMT+0530 (IST)

తమిళ సినిమా పరిశ్రమలో యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించి వాటి కోసం చిత్ర విచిత్రమైన మేకవర్ అయిన విషయం తెల్సిందే. కమల్ గెటప్స్ మరియు కొన్ని సినిమాల్లో ఆయన మేకప్ నభూతో.. అన్నట్లుగా ఉండేవి. కమల్ ను ఈమద్య కాలంలో ఎక్కువగా అనుసరిస్తున్న హీరో విజయ్ సేతుపతి అనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ సేతు పతి తన ప్రతి సినిమాలో కూడా కొత్త మేకోవర్ కు ప్రయత్నిస్తూ ఉన్నాడు. తాను ఏ సినిమా చేసినా కూడా అందులోని పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించే విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘సీతకత్తి’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.బాలాజీ ధరణీధరన్ దర్శకత్వం వహిస్తున్న ‘సీతకత్తి’ చిత్రంలో విజయ్ సేతుపతి 80 ఏళ్ల ముసలి వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్ర కోసం విజయ్ సేతుపతి చాలా విభిన్నమైన మేకోవర్ లో కనిపించనున్నాడు. ఈయన సదరు పాత్ర కోసం అమెరికాలోని ప్రముఖ స్టైలిష్ లు ఒక రూపం తీసుకు వచ్చారు. ఆ రూపంలో మేకోవర్ తో విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంను  వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఈ చిత్రంలోని విజయ్ సేతుపతి లుక్ ప్రస్తుతం సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా విడుదల చేసిన విజయ్ సేతుపతి మేకోవర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. విజయ్ సేతుపతి ఈ చిత్రంతో మరో విభిన్నమైన విజయాన్ని దక్కించుకోవడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇటీవలే విజయ్ సేతుపతి ‘96’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి - విజయాన్ని అందుకున్నాడు. ‘సీతకత్తి’ చిత్రంతో మరో విజయాన్ని విజయ్ అందుకోవడం ఖాయం అంటూ తమిళ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో సైరా నరసింహా రెడ్డి చిత్రంలో విజయ్ సేతుపతి కీలకమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.