`అతిథి`కి సర్ ప్రైజ్ షాకిచ్చిన సీఎం!

Mon Jun 18 2018 17:42:54 GMT+0530 (IST)

విలక్షణ దర్శకుడు కొరటాల శివ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుల కాంబోలో తెరకెక్కిన `భరత్ అనే నేను` బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన కిక్ తో మహేష్ తన 25వ సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు. మహేశ్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు షూటింగ్ తొలి షెడ్యూల్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ లో జరుగుతోంది. అయితే `అతిథి` షూటింగ్ స్పాట్ కు అనుకోని అతిథి వచ్చి చిత్ర యూనిట్ కు షాకిచ్చారు. ఆ షూటింగ్ స్పాట్ కు ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ వచ్చి ప్రిన్స్ ను మర్యాద పూర్వకంగా కలిసి ముచ్చటించారు. మహేష్ - రావత్ నవ్వుతూ మాట్లాడుకుంటోన్న  ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.మహేష్ ను రావత్ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది. లైట్ గా గడ్డంతో క్యాప్ పెట్టుకున్న మహేష్ తో రావత్ నవ్వుతూ ముచ్చటిస్తున్నారు. డెహ్రాడూన్ లో షూటింగ్ కు బసకు అన్ని విధాలుగా సహకరిస్తామని వంశీ మహేష్ లతో రావత్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా  ఈ సినిమాలో ప్రిన్స్ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడబోతున్నాడట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో ఈ కథ ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సినిమా కు సంబంధించి న్యూయార్క్ లో ఎక్కువగా చిత్రీకరణ ఉండబోతోందని కొన్ని కీలకమైన సన్నివేశాలు కర్నూలులో చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. అల్లరి నరేశ్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. దిల్రాజు అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.