ఫోటో స్టోరి: చాక్లెట్ చిక్లెట్ కన్నెవు నువ్వా?

Sun Feb 10 2019 14:56:06 GMT+0530 (IST)

నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా.. క్యాపర్ చీనో కాఫియో.. సోఫియా!
నాకు నీకు నోకియా ఇక రేపో మాపో మాఫియా.. క్యాపర్ చీనో కాఫియో.. సోఫియా!
..
ఓ...ధర్మాకోల్ శిల్పంలా నువ్వే వుంటే నిన్నంటే చిన్న తెల్ల బంతులే నేనులే..
పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలోనా దాహాలే తీరులే వా.చంద్రబోస్ రాసిన ఈ పాట ఎంత పాపులర్ సాంగో తెలిసిందే. ది గ్రేట్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు చిత్రంలోని ఈ పాటకు హ్యారిస్ జైరాజ్ సంగీతం అందించారు. చియాన్ విక్రమ్ - సదా జంట అద్భుతమైన డ్యాన్సింగ్ జిమ్మిక్ తో ఆకట్టుకున్నారు. ఈ పాటలో పదాల్ని మార్చాల్సి వస్తే ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టే ``నాకు నీకూ రెడ్ మీ.. నీకు నాకు యాపిల్!`` అంటూ పాడుకోవాల్సిందే. అయితే అచ్చం యాపిల్ ని తలపిస్తున్న ఈ రెడ్ మి బ్యూటీ పేరు ఊర్వశి రౌతేలా. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న లేటెస్ట్ ట్రెండింగ్ బ్యూటీ ఈవిడ. హేట్ స్టోరి 4 చిత్రంలో నటించి కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. నటించిన తొలి సినిమాతోనే అందాల ఆరబోతలో పీహెచ్‌డీ పుచ్చుకుని .. యూత్ ని వెర్రెత్తిస్తోంది. చాక్లెట్ చిక్లెట్ కన్నెలా కవ్విస్తూ లేటెస్ట్ ఫోటోషూట్లతో అదరగొడుతోంది.

ఊర్వశి సాధ్యమైనంత తొందర్లోనే టాలీవుడ్ లో అడుగుపెట్టే సన్నాహకాల్లో ఉందిట. ఇప్పటికే మన దర్శకనిర్మాతలకు ఫీలర్స్ వదులుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండో చిత్రంలో నటిస్తోంది. మోడళింగ్ నుంచి వెళ్లి హిందీ టీవీ పై వెలిగి అటుపై వెండితెరపైనా తనదైన మార్క్ వేస్తోంది. సమకాలీన నాయికలకు గట్టి పోటీనిచ్చే యవ్వారం తనలో చాలానే ఉందని ఇదిగో ఈ లేటెస్ట్ లుక్ చెబుతోంది.