Begin typing your search above and press return to search.

కుమారికి కోపం.. టీవీ షో నుంచి వాకౌట్!

By:  Tupaki Desk   |   18 Nov 2018 12:09 PM GMT
కుమారికి కోపం.. టీవీ షో నుంచి వాకౌట్!
X
మనకు టాలీవుడ్ లో ప్రస్తుతం బోల్డ్ సినిమాల పండగ జరగుతోంది. ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి' ఈ ట్రెండ్ మొదలుకావడానికి కారణం అని చెప్పుకోవచ్చు. మరో బోల్డ్ సినిమా 'RX100' విజయంతో ఈ బోల్డ్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. ఈ ట్రెండ్ లో భాగంగా '24 కిస్సెస్' అని సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్.

హెబ్బా అనగానే తెలుగు ప్రేక్షకులకు 'కుమారి 21 ఎఫ్' సినిమా గుర్తొస్తుంది. అసలు బోల్డ్ సినిమాల ట్రెండ్ మొదలుకానప్పుడే బోల్డ్ గా నటించిన హెబ్బా ఈ '24 కిస్సెస్' లో రెచ్చిపోయి మరీ హీరోకు లిప్పులాకులు ఇచ్చిందని ప్రోమోస్ లోనే అర్థం అవుతోంది. ఈ సినిమా రిలీజ్ కు దగ్గరపడడంతో '24 కిస్సెస్' టీమ్ టీవీ చానల్స్ లో ఇంటర్వూస్.. ఇతర షోస్ లో పాల్గొంటోంది. అలానే ఒక టీవీ ఛానల్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హోస్ట్ నిర్వహించే డిబేట్ కు హాజరయింది.

ఈ డిబేట్ లో హెబ్బాతో పాటుగా మన కల్చర్ ను పరిరక్షిస్తామని చెప్పుకునేవారు కూడా హాజరయ్యారు. ఇక కామన్ ఆడియన్స్ సరే సరి. మన మసాలా యాంకర్ కి ఇక పండగే కదా. అందరినీ వీలైనంతగా రెచ్చగొడుతూ డిబేట్ ని పీక్స్ కి తీసుకెళ్ళాడు. 'లిప్పు లాకులు' అనే టాపిక్ ఎంత హాట్ అనేది అందరికీ తెలిసిందే. ఎవరి ధోరణిలో వారు చెలరేగిపోయారు. ఇక అందరూ కలిసి హెబ్బా ను తప్పు నీదే... నీదే.. అని వేధించడంతో అప్సెట్ అయింది. షో నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఇక సదరు హోస్ట్.. ఛానల్ వారు ఈ వాకౌట్ ఎపిసోడ్ ని ప్రోమోగా చూపిస్తూ ఆ షో ను చూసేలా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

మంచిదే. వాళ్ళకు మంచి టీఆర్పీలు. జనాలకు మంచి మాసాలా ఎంటర్ టైన్ మెంట్. 24 ముద్దులకు మంచి పబ్లిసిటీ. ఇందులో 'చెడు' ఎక్కడుందో ఆ భగవంతుడుకే తెలియాలి.