ఐ లవ్ యూ: కామాతురాణం ఉపేంద్ర..!

Tue Sep 25 2018 17:56:10 GMT+0530 (IST)

కన్నడ హీరో ఉపేంద్రకు మొదటి నుంది ఒక క్రేజీ హీరో ఇమేజ్ ఉంది.  చిత్ర విచిత్రమైన సబ్జెక్ట్ లతో ఆడియెన్స్ ను షాక్ కు గురిచేసేవాడు. 'ఓం'.. 'A'.. 'ఉపేంద్ర' లాంటి సినిమాలు చూసిన వాళ్ళకు తప్ప ఉపేంద్ర తడాఖా వేరేవాళ్ళకు తెలియదు.  తాజాగా ఉపేంద్ర హీరోగా 'ఐ లవ్ యు' అనే సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో ఉపేంద్ర ఒక రసికుడిగా కనిపిస్తాడట.అంటే కాముడి అవతారం అన్నమాట.  దానికి తగ్గట్టే ఈ సినిమా నుండి ఒక ఘాటు పోస్టర్ ను వదిలారు.  చొక్కా లేకుండా.. ప్యాంటు కూడా లేకుండా ఒక తెల్లని పరుపుపై రెగ్యులర్  శోభనం కోసం ఎదురు చూస్తున్న ప్రేమికుడిలా ఉన్నాడు.  ఇక పంటికింద ఒక ఎరుపు రంగు రోజాపువ్వును పట్టుకొని అసలేమాత్రం సిగ్గుపడకుండా కామబాణాలు విసురుతున్నాడు.  ఈ స్టిల్ చూస్తేనే అయన గారి తీరుతెన్నులు ఎలా ఉంటాయో మీరు అర్థమైపోయిఉండాలి ఈ పాటికి.  మరి ఈ సినిమాకు 'ఐ లవ్ యు' సున్నితమైన పేరు పెట్టడం విశేషమే.  ఈ సినిమా కు ట్యాగ్ లైన్ సిగ్నేచర్ ఆఫ్ టూ హార్ట్స్.

ఈ కన్నడ-తెలుగు బై లింగువల్ సినిమాకు డైరెక్టర్ చంద్రు. ఈ సినిమా ఉపేంద్ర సిగ్నేచర్ స్టైల్ లోనే ఉండబోతుందని డైరెక్టర్ ఆల్రెడీ వెల్లడించాడు.  తన కామావతారంతో ఈ జెనరేషన్ కు ఉపేంద్ర అస్సలు లవ్ ఏంటో చూపిస్తాడట.  ఉపేంద్ర రెడీ అవుతున్నాడు. మీరు కూడా రియల్ లవ్ ఏంటో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి.