Begin typing your search above and press return to search.

మన హీరో కోసం 'ఐ' విలన్‌

By:  Tupaki Desk   |   27 Nov 2015 9:30 AM GMT
మన హీరో కోసం ఐ విలన్‌
X
స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఐ సినిమాతో కోలీవుడ్ కు ప‌రిచ‌యమైన బాలీవుడ్ న‌టుడు ఉపెన్ ప‌టేల్. బాలీవుడ్ కెరీర్ అంతంత మాత్రం గానే సాగుతోన్న ఈ న‌టుడు ఇప్పుడు దృష్టంతా సౌత్ సినిమాల‌పైనే పెట్టిన‌ట్లుంది. తాజాగా ఆది హీరోగా వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చుట్టాల‌బ్బాయి చిత్రంలో ఉపెన్ విల‌న్ పాత్రకు ఎంపిక‌య్యాడు. చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక‌కుతోన్న ఈ చిత్రం మాస్ ఆడియ‌న్స్ ను మెప్పించ‌డానికి ఫైట్లు కూడా ఓ రేంజ్ లో ఉంటున్న‌ట్లు స‌మాచారం. అందుకే ఏరికోరి మ‌రీ ఆదికి విల‌న్ గా ఉ పెన్ ను ఎంపిక చేశారు. ఆదితో యాక్ష‌న్ సీక్వెన్స్ అంటే యూత్ ను బాగానే ఆక‌ట్టుకుంటాయి.

పిట్ట చిన్న‌దైనా కూత గ‌నం అన్న చందాన ప్ర‌తి నాయ‌కులు త‌నను బీట్ చేసేలా ఉన్నా ఆది బాగానే మ్యానేజ్ చేస్తాడు. అందుకే ప‌ర్స‌నాలిటీ చిన్న‌దైనా స్టంట్స్ ఆది కి బాగానే సూట‌వుతాయి. వాటిలో పెద్ద‌గా లోపాల‌ను ఎత్తి చూపాల్సిన ప‌ని ఉండ‌దు. భాయ్ సినిమా ప్లాప్ త‌ర్వాత మ‌ళ్లీ వీర‌భ‌ద్రం చుట్టాల‌బ్బాయి అంటూ లైన్ లోకి వ‌చ్చాడు. ఇప్పుడు అత‌నికి హిట్ చాలా కీల‌కం. అందుకే అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చే విధంగా త‌న మార్క్ కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాల‌ను పూర్తిగా క‌మ‌ర్శిలైజ్ చేసి తెర‌కెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా మ‌ల‌యాళం భామ న‌మిత ప్రమోద్ న‌టిస్తుంది.