Begin typing your search above and press return to search.

మన డ్రైవర్ కథ.. బయోపిక్ గా ముందుకు..

By:  Tupaki Desk   |   14 July 2018 11:43 AM GMT
మన డ్రైవర్ కథ.. బయోపిక్ గా ముందుకు..
X

అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ కౌబాయ్ సినిమాలు తీసి ఓ బ్రాండ్ సృష్టించాడు. అదో ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత కాలంలో డబుల్ రోల్ సినిమాలు వచ్చాయి.. అన్నా చెల్లెలతో సెంటిమెంట్ సినిమాలొచ్చాయి. విక్టరీ వెంకటేష్ అయితే అప్పట్లో చివరన ‘రా’ పేరుతో ఎన్నో ప్రేమకథా చిత్రాలను తీశారు. కొన్ని సార్లు కామెడీ మేనియా నడిచింది. ఇలా ఇండస్ట్రీలో ఎప్పుడే ఏ ట్రెండ్ నడుస్తుందనేది సరిగ్గా చెప్పలేం.

ప్రస్తుతం బయోపిక్ లా కాలం నడుస్తోంది. అలనాటి మేటి నటి సావిత్రి జీవితగాథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ బాక్సాఫీస్ దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే.. ఆ సినిమా తర్వాత హిందీలో వచ్చిన సంజయ్ దత్ ‘సంజు’ మూవీ అయితే బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఈ రెండు హిట్స్ కావడంతో అందరి దృష్టి బయోపిక్ ల పై పడింది. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ జీవితాన్ని ఆయన కుమారుడు - హీరో బాలయ్య తెరకెక్కిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ లో మరో బయోపిక్ వస్తోంది. స్పోర్ట్స్ పర్సన్ జీవితాన్ని తెరకెక్కించడానికి రంగం సిద్ధమైంది. ఫార్ములా వన్ రేసర్ నారాయణన్ కార్తికేయన్ జీవిత కథతో సినిమా తీయడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. తమిళనాడులో పుట్టి పెరిగిన నారాయణన్ 2005 గ్రాండ్ పిక్స్ లో పాల్గొన్నాడు. ఫార్ములా వన్ ఇష్టపడే వారందరికీ ఆయన తెలుసు. ఎన్నో అడ్వంచర్లతో కూడిన ఆయన జీవిత చరిత్రను తమిళం - హిందీ భాషల్లో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉఫేన్ పటేల్ ఈ సినిమాలో నారాయణన్ పాత్రను పోషించబోతున్నాడని తెలిసింది.

బాలీవుడ్ లో వచ్చిన ఎం.ఎస్ ధోనితో ఈ స్పోర్ట్ బయోపిక్ లకు ఆదరణ పెరిగింది. తెలుగులో పుల్లెల గోపిచంద్ బయోపిక్ ను సుధీర్ బాబు హీరోగా తీస్తున్నారు. ఇప్పుడు స్పోర్ట్ పర్సన్ నారాయణన్ బయోపిక్ తెరపై ఎలాంటి అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందో చూడాలి మరి..