Begin typing your search above and press return to search.

నిహారిక.. సుస్మిత.. నో డిఫరెన్స్!!

By:  Tupaki Desk   |   27 Oct 2016 11:30 AM GMT
నిహారిక.. సుస్మిత.. నో డిఫరెన్స్!!
X
ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి ఒక అమ్మాయి తొలిసారిగా హీరోయిన్ గా తెరమీదకు వచ్చింది. ఆమే మెగా డాటర్ కొణిదల నిహారిక. తను హీరోయిన్ గా రావాలని అనుకుంటున్నా అని చెప్పగానే ముందుగా ఫ్యాన్స్ హర్టయ్యారంటూ రిపోర్టులు వచ్చాయి. ఆ తరువాత అసలు తెలుగులో ఇలా హీరోల కూతుళ్ళు హీరోయిన్లుగా సెట్టవుతారా అంటూ సెటైర్లు వినిపించాయి. అసలు ఇలాంటి క్రిటిసిజం అంతా మెగా ఫ్యామిలీ మెంబర్లు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?

''నిహారిక చాలా స్ట్రాంగ్ అమ్మాయి. తన హీరోయిన్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు సుస్మిత కూడా స్టయిలిస్ట్ గా చేస్తోంది. మామయ్య 150వ సినిమాకు తనే డిజైనర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆడ మగా అనే తేడా ఏం ఉంది. నో డిఫరెన్స్. మనం ఫ్యూచర్ జనరేషన్. ఆడాళ్ళు అన్ని పనులూ చేస్తున్నారు. అలాగే మగాళ్లూ వంటింట్లో సాయం చేస్తున్నారు. సో అమ్మాయిలు ఏదైనా చేయొచ్చు'' అంటూ చెప్పింది మెగా వారి కోడలు ఉపాసన కొణిదెల. వాళ్ళు సినిమాల్లో అలా సందడి చేయడం తమ ఫ్యామిలీకి ఎంతో హాయిని ఇస్తోందని అంటోంది ఉపాసన.

ఇకపోతే ఉపాసన వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూపులో దాదాపు 53+ శాతం మంది మహిళా ఉద్యోగస్తులే ఉన్నారట. జెండర్ ఈక్వాలిటీ అనే పేరును వాడకుండా.. ఆడాళ్లు ఏదైనా చేయొచ్చు చేయాలి అంటూ గట్టిగా వాదించింది ఉపాసన. మొత్తానికి నిహారిక కు ఫ్యామిలీలో ఈ రేంజు ఎంకరేజ్మెంట్ ఉంటే.. కెరియర్ వైజ్ ఆమె ఏ రేంజుకు చేరుతుందో చూసుకోండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/