మెగా కోడలు మోస్ట్ పవర్ఫుల్

Tue Sep 25 2018 17:28:03 GMT+0530 (IST)

మెగా కోడలు అన్న బ్రాండ్ వచ్చాక కలిసి వచ్చిందో లేక అలాంటి లక్షణాలు ఉన్నందు వల్లే చరణ్ కు బెటరాఫ్ గా వచ్చిందో తెలియదు కాని ప్రఖ్యాత ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన భవిష్యత్తు శక్తి కిరణాల జాబితాలో ఉపాసనకు చోటు దక్కింది. వివిధ రంగాలకు చెందిన అత్యంత శక్తివంతులైన లిస్టు లో పివి సిందుతో పాటు ఉపాసన పేరు ఉండటం విశేషం. టైకూన్స్ అఫ్ టుమారో పేరుతో ఇచ్చే ఈ పురస్కారం దక్కడం అంటే అంత ఈజీ కాదు.పెళ్లి కాకముందు నుంచే అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ లో అత్యంత కీలక బాద్యతలు చేపట్టిన ఉపాసన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకవైపు సినిమా షూటింగ్ లతో ఉక్కిరిబిక్కిరి అయ్యే చరణ్ కు తోడుగా వీలు కుదిరినప్పుడంతా ఉండే ఉపాసన ఇటీవలే అబైర్జాన్ లో జరిగిన బోయపాటి శీను షూటింగ్ లో కూడా చెర్రితోనే ఉంది. వాటి తాలుకు ఫోటోలు ఆన్ లైన్ బాగా వైరల్ అయ్యాయి.

ఉపాసనకు ఫోర్బెస్ లిస్టు లో చోటు దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇది ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని చిన్న పనులకే ఏదో కొండను మోసినట్టు ఫీలయ్యే ఇప్పటి యువతరానికి కుటుంబాన్ని వృత్తిని ఎలా బాలన్స్ చేసుకోవాలో ఉదాహరణగా ఉపాసనను తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. చరణ్ ఈ విషయంగా ట్విట్టర్ లో ఇంకా స్పందించలేదు. తమ బాండింగ్ కి సంబంధించి రెగ్యులర్ గా ఫోటోలు వీడియోలు షేర్ చేసుకునే ఈ జంట ఈ సందర్భాన్ని కూడా స్పెషల్ గా సెలెబ్రేట్ చేసుకుంటుంది అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. వ్యాపారం-క్రీడలు-నటన-వాణిజ్యం తదితర రంగాల నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళలో ఇద్దరు తెలుగు వాళ్ళకు చోటు దక్కితే ఆ ఇద్దరూ మహిళలే కావడం విశేషం.