ఆయన సహనం నేర్పించారు-ఉపాసన

Sat Feb 16 2019 16:53:41 GMT+0530 (IST)

రామ్ చరణ్ - ఉపాసన జంట అన్యోన్యత గురించి తెలిసిందే. ప్రేమికుల దినోత్సవం  సందర్భర్భం గా  చరణ్ తో తన అనుబంధం గురించి ఎంతో ఆసక్తికరమైన విషయం చెప్పారు ఉపాసన. ప్రేమించకు.. ప్రేమగా ఎదుగు! అంటూ చరణ్ తనతో అన్నారని ఉపాసన తెలిపారు. ఇక ఓ ఆంగ్ల మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన తమ బాంధవ్యం గురించి పలు ఆసక్తికర సంగతుల్ని చెప్పారు.భర్యా భర్తలుగా మీ ఇద్దరు ఒకరినుంచి ఒకరు ఏం నేర్చుకున్నారు? అన్న ప్రశ్నకు ఉపాసన చెప్పిన సమాధానం ఆసక్తికరం. ``రామ్ నుంచి సహనంగా ఉండటం నేర్చుకున్నా. ఆయన నా నుంచి ఎలా సంతోషంగా ఉండాలో నేర్చుకున్నారు`` అంటూ ఉపాసన తెలిపారు. ఇక రామ్ చరణ్ స్టార్ డమ్ గురించి ప్రస్థావిస్తూ ..  సూపర్ స్టార్ అయినా సూపర్ స్టార్ కుమారుడైనా.. జీవితంలో ఏదీ అంత సులభంగా రాదు. మీకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని అన్నారు. చేసే పనిపై నమ్మకమే విజయాన్ని అందిస్తుందని తెలిపారు. మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతరుల్ని గౌరవించడమే సక్సెస్ అని తెలిపారు.

ఇతరుల్లో మీకు నచ్చని విషయాలేమిటి? అని ప్రశ్నిస్తే.. ఆ విషయాలు చాలానే ఉంటాయి. కానీ అలాంటి వాటిని కూడా మార్చుకుంటూ.. సర్దుకుపోవడమే పెళ్లిలోని అందమైన విషయం అని ఉపాసన తెలిపారు. చరణ్ - ఉపాసన కొత్త సంవత్సరంలో కొత్తగా ఫిట్ నెస్ గోల్స్ తో ముందుకు వెళుతున్నారు. అలాగే బాడీ ఫిట్ గా ఉండడం అన్నది చరణ్ ప్రోద్భలం నుంచి ప్రోత్సాహం నుంచి నేర్చుకున్నదేనని ఉపాసన తెలిపారు. ఇక ఫిట్ నెస్ .. ఆరోగ్యం  పై ఉపాసన రెగ్యులర్ గా కొన్ని వీడియోల్ని సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.